బంజారాహిల్స్‌‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ జైన్ కన్స్ట్రక్షన్స్ ఆఫీసులో భారీ చోరీ

బంజారాహిల్స్‌‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ జైన్ కన్స్ట్రక్షన్స్ ఆఫీసులో భారీ చోరీ

జూబ్లీహిల్స్, వెలుగు: నగరంలోని బంజారాహిల్స్‌‌లో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ జైన్ కన్​స్ట్రక్షన్స్ ఆఫీసులో భారీ చోరీ జరిగింది. సంస్థ మేనేజర్ క్యాబిన్‌‌లో భద్రపరిచిన రూ.12.33 లక్షల నగదు, చెక్‌‌బుక్స్‌‌తో కూడిన గోద్రెజ్ లాకర్‌‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 27న ఉదయం కార్యాలయానికి వచ్చిన సంస్థ మేనేజర్ కొమ్మగోని భిక్షపతి, క్యాబిన్‌‌లో ఉంచిన గోద్రెజ్ లాకర్ కనిపించలేదు. 

లాకర్‌‌లో రూ.12 లక్షల 33 వేలతో పాటు సంస్థకు చెందిన చెక్‌‌బుక్స్ ఉన్నాయి. కార్యాలయంలో పనిచేస్తున్న ఆఫీస్ బాయ్ ఎన్.ఫణీంద్రపై యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఘటన జరిగిన రోజు అతను విధులకు హాజరుకాకపోవడమే కాకుండా, ఫోన్ కాల్స్‌‌కు కూడా స్పందించలేదు. జూన్ 26 రాత్రి ఫణీంద్ర ఒక పెద్ద, బరువైన పెట్టెను కార్యాలయం నుంచి బయటకు తీసుకెళ్తుండగా సెక్యూరిటీ గార్డు గమనించారు.