అమెరికా-ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం 15 రోజులకు చేరుకుంది. హార్మూజ్ జలసంధిని బ్లాక్ చేసిన ఇరాన్.. శత్రువుల చమురు నౌకలను వెళ్లకుండా కట్టడి చేస్తోంది. ముఖ్యంగా అమెరికాకు వెళ్లే నౌకలపై దాడులకు దిగుతోంది. దీనికి తోడు గల్ఫ్ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై మిసైళ్లతో విరుచుకుపడుతోంది.
ఇటు అమెరికా, ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ ను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తోంది. హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో శనివారం (మార్చి 14) ప్రెసిడెంట్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుందాం.. యుద్ధ నౌకలను పంపండి.. అంటు ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.
జలసంధి వెంట ట్యాంకర్లకు భద్రతగా అమెరికా నేవీ వెళ్లనుంది. ఇరాన్ జలసంధిని మూసి వేయడంతో ప్రభావితమైన దేశాలు.. యుద్ధ నౌకలను పంపాలి. అమెరికాతో పాటు జలసంధిని దక్కించుకోవడానికి రావాలి.. అంటూ పిలుపునిచ్చారు ట్రంప్.
►ALSO READ | ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడంలో పాక్ నెం.1.. అమెరికా స్నేహం కరెక్ట్ కాదు: ట్రంప్ విధేయురాలు లారా
ఇరాన్ మిలిటరీ శక్తులను 100 శాతం నాశనం చేశాం. కానీ.. డ్రోన్స్, మిస్సైల్ తో .. మైన్స్ తో మేనేజ్ చేయాలని చూస్తోంది. ఇరాన్ దారుణంగా ఓడి పోయింది.
చైనా, ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియా, యూకే మొదలైన దేశాలు నౌకలను పంపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ట్రంప్. ఈ దేశాలు నౌకలను పంపిస్తే.. హార్మూజ్ జలసంధి దగ్గర ఇక ఎలాంటి అడ్డంకులు ఉండవని అన్నారు.
