పాకిస్తాన్ ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని అన్నారు లారా లూమర్. పాక్ తో స్నేహం అమెరికాకు మంచిది కాదని హెచ్చరించారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్ ను నెత్తిన ఎక్కించుకుంటున్న తరుణంలో.. ఆయన విధేయురాలు లారా చేసిన స్టేట్ మెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. శనివారం (మార్చి 14) ఇండియా టుడే కాంక్లేవ్ 2026 లో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారామె.
అతివాద, జాతీయ భావాలున్న లారా లూమర్.. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రచారంతో గెలుపులో పాత్ర పోషించారు. అలాంటి లారా.. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడులు ఎక్కడో ఒక చోట పాకిస్తాన్ కు సంబంధం కలిగే ఉంటాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఇండియా, యూకేలో జరిగిన దాడులు పాక్ కు సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు.
►ALSO READ | ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ స్టోరేజ్ పై ఇరాన్ దాడులు : మంటల్లో UAE ఫుజైరా ఓడరేవు
పాకిస్తాన్ బహిరంగంగానే జిహాదిస్ట్, షరియా అనుకూల దేశమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిస్ట్ అటాక్ ల ను గురించి చూస్తే అవి పాకిస్తాన్ కు ఏదో ఒక విధంగా లింక్ ఉన్నవిగానే కనిపిస్తాయని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, సీనియర్ అమెరికన్ పొలిటీషియన్స్ ను చంపేందుకు కుట్ర పన్నిన పాకిస్తాన్ దేశస్తుడు ఆసిఫ్ మర్చంట్ కు గత వారం పడిన శిక్షను తన వాదనలకు సాక్ష్యంగా చెప్పారు లూమర్. ఇరాన్ ఆదేశాలతో అమెరికాలో ట్రంప్ సహా సీనియర్ నేతలను హత్య చేసేందుకు ఆసిఫ్ మర్చంట్ కుట్ర పన్నినట్లు అతనిపై ఆరోపణలున్నాయి. 2020 లో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసెమ్ సోలీమనీ మృతికి ప్రతీకారంగా కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో యూఎస్.. పాక్ తో కాకుండా ఇండియాతో బలమైన సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
