ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ స్టోరేజ్ పై ఇరాన్ దాడులు : మంటల్లో UAE ఫుజైరా ఓడరేవు

ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ స్టోరేజ్ పై ఇరాన్ దాడులు : మంటల్లో UAE ఫుజైరా ఓడరేవు

ఇరాన్ కొడుతున్న దెబ్బలకు.. వ్యూహాత్మక దాడులకు గల్ప్ దేశాలు అల్లాడిపోతున్నాయి. UAE.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అతి పెద్ద ఇంధన నిల్వల కేంద్రం అయిన ఫుజైరా ఓడరేవుపై ఇరాన్ డ్రోన్లతో బాంబులు వేసింది. ఈ ఫుజైరా ఆయిల్ కేంద్రం ప్రపంచంలోనే అతి పెద్దది. హర్మూజ్ జలసంధికి వెలుపల ఉంటుంది. హర్మూజ్ జల సంధి మూసేసినా.. ఈ ఫుజైరా ఇంధన నిల్వ కేంద్రం అండ్ పోర్ట్ నుంచి ఆయిల్ ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ఈ పరిణామాలను బాగా తెలిసిన ఇరాన్.. 2026, మార్చి 14వ తేదీ శనివారం ఉదయం.. యూఏఈలోని ఫుజైరా ఆయిల్ డిపో, పోర్టుపై బాంబులు, మిస్సైల్స్ తో విరుచుకుపడింది. 

ఇరాన్ దాడి తర్వాత ఫుజైరా ఆయిల్ డిపో నుంచి మంటలు ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అప్రమత్తం అయిన యూఏఈ సర్కార్.. పోర్టును తాత్కాలికంగా మూసివేసింది. ఆయిల్ ఎగమతులు, దిగుమతులను క్లోజ్ చేసింది. 

UAE తూరన్పుతీరంలో అతి పెద్ద పోర్టుతోపాటు ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆయిల్ బంకరింగ్ యూనిట్ ఇదే. గల్ఫ్ దేశాల ఆయిల్ ఎగుమతులకు ఇది ప్రధానమైన ఔట్ లెట్ గా ఉంది. ఇలాంటి ఫుజైరా ఆయిల్ పోర్టుపై ఇరాన్ దాడితో యూఏఈకి అతి పెద్ద దెబ్బగా చెబుతున్నారు అంతర్జాతీయ నిపుణులు. 

►ALSO READ | ఒక పక్క వార్ వేడెక్కిస్తుంటే.. కిమ్ సడన్గా ఇంత పని చేశాడేంటి..!

ఫుజైరా ఆయిల్ పోర్టును మూసివేస్తే.. అక్కడి నుంచి ఇంధన ఎగుమతులకు బ్రేక్ పడితే ఇండియా, చైనా, పాకిస్తాన్ దేశాలతోపాటు చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందనే భయాలు వెంటాడుతున్నాయి. 

గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ నిల్వలు, ఇంధన కంపెనీలు, పోర్టులను టార్గెట్ చేస్తూ.. ఇరాన్ చేస్తున్న దాడులతో ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు ఆయిల్ కొరత, సంక్షోభాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని.. రాబోయే రోజుల్లో ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు.