మిడిల్ ఈస్ట్లో యుద్ధం 15వ రోజుకు చేరుకున్న క్రమంలో నార్త్ కొరియా బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది బాలిస్టిక్స్ మిస్సైల్స్ ప్రయోగించి జపాన్ దేశాన్ని హడలెత్తించింది. జపాన్ సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించిందని దక్షిణ కొరియా, జపాన్ ధృవీకరించాయి. జపాన్ సముద్రంలో ఈ క్షిపణులు కూలాయి.
[Emergency alert]
— PM's Office of Japan (@JPN_PMO) March 14, 2026
North Korea has launched a suspected ballistic missile. More updates to follow.
అమెరికా, దక్షిణ కొరియా మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ అంశాన్ని సాకుగా చూపించి ఉత్తర కొరియా ఈ మిలటరీ డ్రిల్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ఉత్తర కొరియా గతంలో కూడా చేసిన పనే కావడం గమనార్హం. ఉత్తర కొరియా నుంచి బెదిరింపులు వ్యక్తమవుతున్న క్రమంలో పూర్తిగా స్వీయ రక్షణ కోసం ఐదు రోజుల క్రితం సియోల్, వాషింగ్టన్ మిలటరీ కీలక డ్రిల్ నిర్వహించాయి.
Instructions by the Prime Minister in Response to the Missile Launch by North Korea (13:30) pic.twitter.com/s447obl1FB
— PM's Office of Japan (@JPN_PMO) March 14, 2026
గత గురువారం దక్షిణ కొరియా ప్రధాన మంత్రి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో వాషింగ్టన్ లో సమావేశం కావడం గమనార్హం. ఉత్తర కొరియాతో 2019 నుంచి దక్షిణ కొరియాకు పూర్తిగా మాటలు బంద్ అయిపోయాయి.
దక్షిణ కొరియా ప్రధాన మంత్రి కిమ్ మిన్ సియోక్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ను త్వరలో కలవాలని భావిస్తున్నట్లు ట్రంప్ తనతో చెప్పినట్లు తెలిపారు. ఈ ఏప్రిల్లో ట్రంప్ బీజింగ్ పర్యటన ఉంది. ఈ క్రమంలోనే కిమ్ జాంగ్ ఉన్తో ట్రంప్ భేటీ కావాలని భావిస్తున్నారని, ఈ భేటీ కచ్చితంగా అప్పుడే ఉంటుందని చెప్పలేమని కిమ్ మిన్ సియోక్ తెలిపారు.
Government of Japan activated an emergency response team after a suspected ballistic missile launch by North Korea
— Nabila Jamal (@nabilajamal_) March 14, 2026
Prime Minister Sanae Takaichi ordered immediate monitoring and emergency protocols to track the projectile and protect Japanese territory. The missile was detected… pic.twitter.com/RdSEHWpIfL
