పనిలో ఉండి మధ్యాహ్నం భోజనం చేయడం మర్చిపోతే కడుపు నకనకలాడుతుంది. అదే టీవీ చూస్తూనో, ఫోన్ స్క్రోల్ చేస్తూనో ఉంటే.. ఇప్పుడే తిన్నా కూడా 'ఏదైనా క్రిస్పీగానో, స్వీట్‌గానో తింటే బాగుండు' అనిపిస్తుంది." మనలో చాలా మంది నిత్యజీవితంలో ఎదుర్కొనే పెద్ద కన్ఫ్యూజన్ ఇది. అసలు మనకు నిజంగానే ఆకలి వేస్తోందా ? లేక మైండ్ ఆడుతున్న డ్రామానా ? అనేది తెలీక దొరికింది నమిలేస్తూ బరువు పెంచుకుంటూ ఉంటాం. మరి ఈ రెండింటి మధ్య తేడాను కనిపెట్టడం ఎలాగో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం....
ఆకలి వేసినా, ఆకలిగా అనిపించినా (క్రేవింగ్) తినడం ఇంతకు ముందు కంటే ఎక్కువైంది. అసలు ఆకలి, క్రేవింగ్స్ ను ఎలా గుర్తించాలో చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్...
క్రేవింగ్స్
కడుపునిండా తిని గంట, గంటన్నర అయిందో లేదో మళ్లీ ఆకలి అవుతోందా..! అయితే అది కచ్చితంగా క్రేవింగ్. ఎందుకంటే నిజంగా ఆకలి వేస్తే పొట్ట సిగ్నల్ ఇస్తుంది. అలాగే క్రేవింగ్స్ ఉన్నప్పుడు.. పర్టిక్యులర్ ఫుడ్, ఫలానా టేస్ట్ ఉన్నది మాత్రమే తినాలనే కోరిక ఉంటుంది. ఎక్కువ తీపి, ఉప్పు ఉండే ఫుడ్ మాత్రమే తినాలనిపిస్తుంది.
చాక్లెట్, స్వీట్స్, చిప్స్ పైకి మనసు లాగుతుంది. ఆకలిగా అనిపించినప్పుడు తినడం అప్పటి వరకు బాగుంటుంది. కానీ, తర్వాత ఎందుకు తిన్నామా...! అని బాధపడతాం.
కొన్ని గంటలు తినకుండా ఉంటే మామూలుగానే ఆకలి వేస్తుంది. అప్పుడు పొట్ట ఆటోమెటిక్ గా సిగ్నల్ ఇస్తుంది. అలాగే తలనొప్పితో పాటు వీక్ నెస్ అనిపిస్తుంది. ఆ టైమ్లో ఫుడ్ లేదా ఏదైనా శ్నాక్ తిన్నా కూడా ఆకలి తగ్గిపోతుంది.
న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్, ఢిల్లీ
