హైదరాబాద్: ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఆదివారం (మార్చి 15) సంగారెడ్డి జిల్లాలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల తరపున కేసీఆర్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. ఆయన అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని.. ఆయన ఈసారైనా అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామన్నారు.
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి 11 సీట్లు వచ్చాయని.. దీంతో వారికి ప్రతిపక్ష హోదా దక్కలేదన్నారు. కానీ మేం మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చామని అన్నారు. సభకు వచ్చి కేసీఆర్ ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. మా ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులు కేసీఆర్ చెబితే ఆయనకే గౌరవం పెరుగుతోందని అన్నారు. ఇక, మూసీపై కేటీఆర్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తే నవ్వు వస్తోందన్నారు.
►ALSO READ | రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల
మూసీతో నల్గొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఫ్లోరైడ్ సమస్యతో ఇన్ని ఇబ్బందులు పడ్డామో నల్గొండ ప్రజలకు తెలుసని చురకలంటించారు. ఆనాడు కేసీఆర్ ఇచ్చిన దొడ్డు బియ్యం ఎవ్వరు తినలేదుని.. రేషన్ డీలర్లకే వాటిని అమ్ముకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పారు.
