ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం 'మిస్సింగ్ మేఘన'. వాచస్పతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. దర్శకుడు వాచస్పతి, హీరో రామ్ కార్తీక్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సంగీత దర్శకుడు ధృవన్ ప్రతిభకు ఈ చిత్రం మరింత గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిత్ర బృందానికి ప్రేక్షకుల ఆదరణ లభించాలని ఆశించారు.
ALSO READ : Korean Kanakaraju: ఒక రోజు ముందే థియేటర్లలోకి 'కొరియన్ కనకరాజు..
'మిస్సింగ్ మేఘన' ఒక ఆసక్తికరమైన సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని తెలిపారు దర్శకుడు వాచస్పతి. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు సినిమాలో ఉంటాయని, త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. హీరో రామ్ కార్తీక్, సంగీత దర్శకుడు ధృవన్ కూడా ఈ సందర్భంగా చిత్రానికి ప్రేక్షకులు ఆధరించాలని కోరారు.
