మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. దర్శకుడు మెర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటించగా, ప్రమోషన్లతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్ కంబ్యాక్ మూవీగా నిలవబోతుందనే అంచనాలను సినీ వర్గాల్లో పెంచేస్తోంది.
ప్రత్యేక పెయిడ్ ప్రీమియర్స్ షో..
లేటెస్ట్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ చేసిన ప్రకటన అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమాకు.. ఒక రోజు ముందే అంటే ఆగస్టు 6 గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహిస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. సినిమా ఫలితంపై తమ టీమ్‌కు ఉన్న పూర్తి నమ్మకమే ఈ నిర్ణయానికి కారణమని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు.
అడ్వాన్స్ బుకింగ్స్..
ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. తొలి స్పందన ఎంతో పాజిటివ్‌గా కనిపిస్తోంది. టికెట్ బుకింగ్స్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే సినిమా చుట్టూ ఏర్పడిన బజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ వారం విడుదలవుతున్న ఐదు చిత్రాల్లో 'కొరియన్ కనకరాజు'అత్యంత ఆసక్తికరమైన సినిమాగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ALSO READ : బర్త్ డే ట్రీట్ ..సర్దార్ 2’ నుంచి మాళవిక మోహనన్ స్పెషల్ పోస్టర్
హారర్, కామెడీ అంశాలను వినోదాత్మకంగా మేళవించిన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, ప్రమోషనల్ కంటెంట్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. వరుణ్ తేజ్‌కు తోడు రితికా నాయక్, సత్య, దక్ష నాగర్కర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయి బాబా జగర్లమూడి నిర్మించారు. థమన్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకుంటుండగా, ప్రీమియర్స్ తర్వాత వచ్చే టాక్‌తో 'కొరియన్ కనకరాజు' బాక్సాఫీస్ వద్ద వరుణ్ తేజ్‌కు సాలిడ్ కంబ్యాక్ అందిస్తుందా అనే ఆసక్తి ఇప్పుడు ఇండస్ట్రీ అంతటా నెలకొంది.
