ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై మెటా సీఈవో జుకెన బర్గ్ కు కేంద్ర ప్రభుత్వం అల్టీమేటం జారీ చేసింది.. మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలి.. లేదా చర్యలు తీసుకోవాలని హెచ్చరింది.జూలై 23న ప్రధాన మోదీ వీడియోను ఫేస్ బుక్ నుంచి కొంత సమయం మెటా తొలగించడంతో వివాదస్పదమైంది.. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మెటా సీఈవో మార్క జుకెర్ బర్గ్ కు పార్లమెంటరీ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ డిమాండ్ చేసింది.
ప్రధాని మోదీ వీడియోను తొలగించడాన్ని ప్రజాస్వామ్యంపై దాడి అని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నేతృత్వంలోని కమిటీ అభిప్రాయపడింది. ఇది 140 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిని లక్ష్యంగా చేసుకుందని జరిగిందని ఆరోపించింది. మూడు రోజుల్లోగా స్పందించకపోతే ఫేస్‌బుక్ సేఫ్ హార్బర్ సెక్యూరిటీని రద్దు చేసేందుకు భారత ప్రభుత్వం పరిశీలిస్తుందని, క్రిమినల్ విచారణ తప్పదని కమిటీ హెచ్చరించింది.
ఇదిలా ఉండగా తెలంగాణ పోలీసులు గూగుల్, మెటాలపై వేర్వేరు ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గూగుల్ ఫ్రాడ్ ఫైనాన్షియల్ అప్లికేషన్లను హోస్ట్ చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ప్రధాని మోదీ నకిలీ వీడియోను ప్రచారం చేసినందుకు మెటాపై కేసు నమోదు చేశారు.
►ALSO READ | నితిన్ గడ్కరీపై E20 పెట్రోల్ పోస్టులు తొలగించండి : టెక్ కంపెనీలకు హైకోర్టు ఆర్డర్
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ వీడియోను జూలై 23న కొద్దిసేపు తొలగించడంతో ఈ వివాదం మొదలైంది. సెల్ఫీ వీడియోలో ప్రధాని మోదీ ఫస్ట్ లైవ్ లో మాట్లాడారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తుండగా పేపర్ లీకులపై చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. అయితే ఆ పోస్ట్ ఫేస్‌బుక్ వెర్షన్‌ను మెటా మొదట కొద్దిసేపు తొలగించింది. ఆ తర్వాత పునరుద్ధరించింది.
ఈ సంఘటనపై కమిటీ మెటా అధికారులను సంప్రదించడగా సాంకేతిక లోపమని కంపెనీ క్షమాపణ చెప్పింది. ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మెటా వివరణను తిరస్కరించింది. వీడియో తొలగింపుపై బీజేపీ నేతలు ఆన్‌లైన్ లో మెటాను నిలదీశారు. వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ పోలీసులు గూగుల్, మెటాలపై వేర్వేరు ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గూగుల్ మోసపూరిత ఆర్థిక అప్లికేషన్లను హోస్ట్ చేస్తోందని ఆరోపణలు ఎదుర్కోగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నకిలీ వీడియోను ప్రచారం చేసినందుకు మెటాపై కేసు నమోదు చేశారు.
