కేంద్ర మంత్రి నితిణ్ గడ్కరీపై E20 పెట్రోల్ పోస్టులపై ముంబై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో నితిన్ గడ్కరీ, అతని ఫ్యామిలీపై ఉన్న అసభ్యకర పోస్టులను వెంటనే తొలగించాలని మోటా , ఎక్స్, గూగుల్ సంస్థలను ఆదేశించింది. ఇకపై ఇలాంటి పోస్టులు పెడితే వెంటనే తొలగించాలని సూచించింది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై E20 పెట్రోల్ పోస్టులను వెంటనే తొలగించాలని బుధవారం (ఆగస్టు5) టెక్ కంపెనీలకు ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. E20 పెట్రోల్ వివాదం సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ ఆదేశాలు చేసింది. సోషల్ మీడియాలో తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం, ఏఐ ద్వా డీప్‌ఫేక్ వీడియోలు, పోస్టులు వైరల్ చేస్తున్నారని గడ్కరీ కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి పరువు తీసేలా ప్రచారం చేస్తున్నారని పిటిషన్‌లో తెలిపారు.
►ALSO READ | మ్యూల్ అకౌంట్లపై ఎస్ఓపీ రూపొందించాలి..ఆర్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఈ పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గడ్కరీ, గడ్కరీ ఫ్యామిలీపై అసభ్యకర పోస్టులు సోషల్ మీడియాలోఉన్నట్లు కోర్టు గుర్తించింది. మెటా, ఎక్స్, గూగుల్ వంటి ప్లాట్ ఫాంలు.. ఆ పోస్టులను వెంటనే తొలగించాలని ఆదేశించింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి డీప్‌ఫేక్ కంటెంట్ వస్తే, బాధితుడు నేరుగా ప్లాట్‌ఫారం లను సంప్రదించవచ్చని, అవి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇలాంటి కంటెంట్‌ను ముందుగానే గుర్తించి తొలగించే వ్యవస్థలు ఎందుకు లేవని కూడా కోర్టు ప్రశ్నించింది.
దేశ వ్యాప్తంగా E20 పెట్రోల్ పై దుమారం రేగుతోంది. 20 శాతం ఇథనాల్ పెట్రోల్ పాత వాహనాల ఇంజిన్‌లకు నష్టం కలిగిస్తుందని ప్రతిపక్షాలు, కొన్ని వినయోగదారుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను గడ్కరీ ఖండించారు. ఆటోమొబైల్ కంపెనీలు, నిపుణులతో విస్తృతంగా పరీక్షలు నిర్వహించిన తర్వాతే E20 ఇంధనాన్ని అమలు చేశామని, ఇది ఇంజిన్‌లకు ఎలాంటి హాని చేయదని చెబుతుతోంది కేంద్ర ప్రభుత్వం.
