మ్యూల్ అకౌంట్లపై ఎస్ఓపీ రూపొందించాలి..ఆర్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు

మ్యూల్ అకౌంట్లపై ఎస్ఓపీ రూపొందించాలి..ఆర్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: సైబర్ నేరాలను ఎదుర్కొనే యంత్రాంగానికి విస్తృతమైన స్వీకరణ, వేగవంతమైన అమలు, నిరంతర పర్యవేక్షణ అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. సైబర్ మోసాలకు గురైన బ్యాంకు ఖాతాలు, ముఖ్యంగా మ్యూల్ అకౌంట్ల వ్యవహారాన్ని పరిష్కరించేందుకు నాలుగు వారాల్లోగా ఒక స్టాండర్ట్​ ఆపరేటింగ్​ప్రొసీజర్​(ఎస్ఓపీ) రూపొందించి సర్క్యులేట్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (ఆర్బీఐ) ఆదేశించింది. 

డిజిటల్ అరెస్ట్, నకిలీ పత్రాలకు సంబంధించిన కేసులపై దాఖలైన సుమోటో వ్యాజ్యాన్ని సీజేఐ జస్టిస్​ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనాతో కూడిన బెంచ్ మంగళవారం విచారించింది. ఆమోదించదగిన నివేదికలను పరిశీలించిన అనంతరం, ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు విన్న బెంచ్.. ఆర్బీఐకి పలు ఆదేశాలు జారీ చేసింది. ‘మ్యూల్ అకౌంట్లు, మనీలాండరింగ్ కార్యకలాపాలు, సైబర్ మోసాలతో ముడిపడి ఉన్న ఖాతాలను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ 4 వారాల్లోగా ఎస్ఓపీని తయారుచేసి సర్క్యులేట్ చేయాలి’ అని సూచించింది.