బర్త్ డే ట్రీట్ ..సర్దార్ 2’ నుంచి మాళవిక మోహనన్ స్పెషల్ పోస్టర్

బర్త్ డే ట్రీట్  ..సర్దార్ 2’ నుంచి మాళవిక మోహనన్ స్పెషల్ పోస్టర్

తనదైన గ్లామరస్ యాక్టింగ్‌‌తో టాలీవుడ్, కోలీవుడ్‌‌లో గుర్తింపును తెచ్చుకుంది మాళవిక మోహనన్. మంగళవారం ఆమె  పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న ‘సర్దార్ 2’ నుంచి స్పెషల్ పోస్టర్‌‌‌‌తో బర్త్‌‌డే విషెస్ తెలియజేసింది టీమ్. కార్తి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ యాక్షన్ ప్యాక్డ్ పవర్‌‌‌‌ఫుల్ రోల్‌‌లో కనిపించనున్నట్టు రివీల్ చేశారు. చేతిలో కత్తితో ఇంటెన్స్‌‌ లుక్‌‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  

బ్యాక్‌‌గ్రౌండ్‌‌లో భారీ పేలుళ్లు, యాక్షన్ విజువల్స్ ఉండటంతో  ఆమె పాత్ర ఎంత పవర్‌‌ఫుల్‌‌గా ఉండబోతుందో  తెలుస్తుంది. ఈ చిత్రంలో  గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా, యాక్షన్‌‌కు ప్రాధాన్యం ఉన్న కీలక పాత్రలో కనిపించబోతుందని అర్ధమవుతోంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న   ఈ చిత్రాన్ని  ఎస్‌‌ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు.  సెప్టెంబర్ 10న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  తెలుగులో అన్నపూర్ణ  స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల  కానుంది.