- అనుమానమే హత్యకు కారణం?
నారాయణఖేడ్, వెలుగు: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి క్రూరంగా వ్యవహరించాడు. కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం డెడ్‌బాడీని దర్గా లోపల పడేశాడు. వివరాల్లోకెళ్తే.. సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలంలోని ఇరక్‌పల్లి గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన ముల్తాన్, ఇర్ఫానా(32) దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇర్ఫానాపై ముల్తాన్ అనుమానం పెంచుకుని వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఇర్ఫానాను ముల్తాన్ మౌలాలి దర్గా ప్రాంతానికి తీసుకెళ్లాడు. కత్తితో పొడిచి హత్య చేసి మృతదేహాన్ని దర్గాలో పడేశాడు. అనంతరం నేరుగా ముల్తాన్ నాగల్‌గిద్ద పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్సై రవీందర్ ఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
