ఆశిష్ గాంధీ హీరోగా నటిస్తున్న తాజా రొమాంటిక్ క్రైమ్ డ్రామా ‘డానీ’. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్‌లపై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ‘ఫస్ట్ స్ట్రైక్’(టీజర్)ను విడుదల చేశారు.
ఈ ఫస్ట్ స్ట్రైక్‌లో యూత్‌ను ఆకట్టుకునే రొమాంటిక్ డైలాగ్స్, బోల్డ్ విజువల్స్ హైలైట్‌గా నిలిచాయి. బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సంభాషణలు, రా అండ్ రస్టిక్ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
నువ్వు బీచ్కి ఒక్కడివే వస్తావా? అని హీరోయిన్ అడగ్గా.. బీచ్కి రావాలంటే అమ్మాయి పక్కా ఉండాలి.. ఎందుకంటే, నాకు బీచ్ అన్నా.. అమ్మాయి బ్యాక్ అన్నా చాలా ఇష్టం.. అని హీరో తనదైన టోన్లో చెప్పడం యూత్కు కిక్కిచ్చేలా ఉంది. కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా, కథలో మంచి యాక్షన్ డ్రామా కూడా ఉండబోతోందని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.
‘నాటకం’, ‘కళింగ’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల తర్వాత కళ్యాణ్‌జీ గోగణ–ఆశిష్ గాంధీ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో ఇండస్ట్రీలో దీనిపై మంచి బజ్ ఏర్పడింది. ఈ టీజర్‌కు ఏకే ఆనంద్ సినిమాటోగ్రఫీ, సాయి కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తోన్న ‘డానీ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.
