అప్పుల బాధతో చెరువులో దూకి రైతు ఆత్మహత్య..సిద్దిపేట జిల్లాలో ఘటన

అప్పుల బాధతో చెరువులో దూకి రైతు ఆత్మహత్య..సిద్దిపేట జిల్లాలో ఘటన

 


 

చేర్యాల, వెలుగు:  అప్పుల బాధతో ఓ రైతు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, 
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొత్త దొమ్మాట గ్రామానికి చెందిన శెట్టె రామస్వామి(38) వ్యవసాయం, ఆవుల షెడ్డు నిర్మాణం, బోర్లు వేయడం కోసం రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడే. వాటిని తీర్చలేక మనస్తాపంతో సోమవారం సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. అనంతరం బైక్​పై చేర్యాలకు వెళ్లి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శెట్టె లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.