MS Dhoni: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఈరోజు (మార్చి 15న) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. పాకిస్థాన్ జట్టుకు వికెట్‌కీపర్-బ్యాటర్‌గా అతను ఎన్నో కీలక సేవలు అందించారు. పాక్ టీమ్ తరఫున చివరి మ్యాచ్‌ను 2023లో ఆడారు. ఇటీవల పాకిస్థాన్ సెలెక్షన్ కమిటీలో సభ్యుడిగా చేరిన సర్ఫరాజ్, త్వరలోనే పాకిస్థాన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం క్లీయర్ గా కనిపిస్తుంది. తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక విషయాలను తెలిపారు.
వికెట్‌కీపర్‌గా కెరీర్ ప్రారంభించిన నేను.. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తన ఆదర్శంగా తీసుకున్నట్లు సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్‌కీపర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ధోనీ, వికెట్‌కీపింగ్, కెప్టెన్సీ, బ్యాటింగ్‌లో ఎన్నో విజయాలు సాధించారు.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐదేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోనీ ఇప్పటికీ భారత క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్‌కీపర్లలో ఒకరిగా కొనసాగుతున్నారని వెల్లడించారు. 2016 టీ20 ప్రపంచకప్ సందర్భంగా సర్ఫరాజ్ ధోనీపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లో షాహిద్ అఫ్రిదీ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టులో సభ్యుడిగా ఉన్న అతడు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ధోనీ ఆటతీరును తరచూ గమనిస్తానని చెప్పారు. ధోనీని నేను ఎక్కువగా అనుసరిస్తాను.. వికెట్‌కీపింగ్, బ్యాటింగ్‌లో అతడు చూపే ప్రతిభ నన్ను ఎంతో ఆకట్టుకుంటుందని సర్ఫరాజ్ పేర్కొన్నాడు.
►ALSO READ | IPL Trophy: 18 సీజన్లు గడిచిన ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకోని జట్లు ఇవే?
మహేంద్ర సింగ్ ధోనీ నుంచి చాలా విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. టీమిండియాకు ఆయన గొప్ప ఆటగాడు.. ఆయనలా మ్యాచ్‌ను ముగించగల ప్లేయర్స్ గా నేను కూడా మారాలని ఆశిస్తున్నాను అన్నారు. 2016 టీ20 ప్రపంచకప్‌లో పాక్ నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే విజయం సాధించి టోర్నమెంట్ నుంచి వైదొలగింది. ఆ టోర్నమెంట్ అనంతరం సర్ఫరాజ్ పాకిస్థాన్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడి నాయకత్వంలో పాకిస్థాన్ జట్టు 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
అయితే 2019 ప్రపంచకప్ తర్వాత సర్ఫరాజ్ కెప్టెన్సీ నుంచి తప్పించబడ్డారు. అనంతరం ఆయన జాతీయ జట్టులో స్థానం కూడా కోల్పోయారు. 2019 ప్రపంచకప్ తర్వాత అతడు కేవలం మూడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. కెప్టెన్‌గా సర్ఫరాజ్ పాకిస్థాన్‌ను 13 టెస్టులకి సారథ్యం వహించి నాలుగు విజయాలు అందించారు. అలాగే 50 వన్డేల్లో జట్టుకు నాయకత్వం వహించి 28 విజయాలను సాధించారు. టీ20ల్లో అతడి నాయకత్వంలో పాకిస్థాన్ జట్టు 37 మ్యాచ్‌లలో 29 విజయాలు సాధించడం విశేషం. 2006లో పాకిస్థాన్ అండర్-–19 జట్టుకు నాయకత్వం వహించి ప్రపంచకప్ టైటిల్‌ను కూడా గెలిపించారు. ఇకపై సర్ఫరాజ్ పాకిస్థాన్ క్రికెట్‌తో మరో రూపంలో కొనసాగనున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ వైట్ బాల్ జట్లకు మైక్ హెస్సన్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
