న్యూఢిల్లీ: విమెన్స్ ఆసియా కప్ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) గురువారం విడుదల చేసింది. సెప్టెంబర్ 5న జరిగే మ్యాచ్‌లో ఇండియా.. పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆగస్టు 28 నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్.. హాంకాంగ్‌ను ఎదుర్కొంటుంది. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
మొత్తం 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్ ఉండగా.. గ్రూప్–బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేసియా, యూఏఈ ఉన్నాయి. గ్రూప్‌లో టాప్–2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. సాయంత్రం 6.30 నుంచి మ్యాచ్‌లు మొదలవుతాయి. ఇండియా 2012, 2016, 2022లో టైటిల్ గెలుచుకుంది.
