India vs Japan T20: ఆసియా గేమ్స్ 2026 ఆరంభానికి ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక చారిత్రాత్మక ఘట్టం క్రియేట్ చేయబోతుంది. ప్రపంచ నంబర్ 1 జట్టైన భారత క్రికెట్ టీమ్, 41వ ర్యాంకర్ అయిన జపాన్‌తో తొలిసారిగా తలపడనుంది. రేపు (సెప్టెంబర్ 22, మంగళవారం) రోజున జపాన్‌లోని తోచిగిలోని సాను ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ ఏకైక సుజుకి కప్ టీ20 (Suzuki Cup 2026)' మ్యాచ్ జరగనుంది. భారత్ - జపాన్ దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పోర్ట్ 75 (Sport 75) చొరవలో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఆసియా గేమ్స్ ప్రిపరేషన్‌కు ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది.
టీమిండియాలో ఆ ముగ్గురుఔట్:
* న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌పై 3–0 తేడాతో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసి వచ్చిన శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టులో ఆసియా గేమ్స్‌కు ముందు కొన్ని కీలక మార్పులు జరిగాయి.
* వరుణ్ చక్రవర్తి ఔట్: తొడ కండరాల గాయం (Side Strain) కారణంగా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆసియా గేమ్స్, ఈ జపాన్ టీ20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ విప్రజ్ నిగమ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
* హర్షిత్ రాణా దూరం: ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయంతో తప్పుకోగా, అతని స్థానంలో యష్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు.
* నితీష్ రెడ్డి తప్పుకుంటే: ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆసియా గేమ్స్ స్క్వాడ్ నుంచి తప్పుకున్నాడు.
జపాన్ సవాలు.. కెప్టెన్‌గా కడోవాకి ఫ్లెమింగ్:
* ఈ మ్యాచ్‌లో జపాన్ జట్టు తమ ఆసియా గేమ్స్ స్క్వాడ్‌తోనే బరిలోకి దిగుతోంది. జపాన్ ఆల్ టైమ్ హైయెస్ట్ టీ20 రన్ స్కోరర్ కెండెల్ కడోవాకి ఫ్లెమింగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇబ్రహీం తకాహాషి, డెక్లాన్ సుజుకి-మెక్‌కోంబ్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు.
లైవ్ టెలికాస్ట్ & స్ట్రీమింగ్ వివరాలు:
* తేదీ & సమయం: సెప్టెంబర్ 22 (మంగళవారం) ఉదయం 9:30 గంటలకు (IST) మ్యాచ్ ప్రారంభమవుతుంది.
* టీవీ టెలికాస్ట్: భారత్‌లో Star Sports 1, Star Sports 1 Hindi ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
* లైవ్ స్ట్రీమింగ్: మొబైల్/ఓటీటీలో FanCode యాప్, వెబ్‌సైట్‌లో ఈ మ్యాచ్‌ను లైవ్ చూడవచ్చు.
ఇరు జట్ల పూర్తి స్క్వాడ్లు :
భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్, విప్రజ్ నిగమ్.
జపాన్ జట్టు: కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ (కెప్టెన్), చార్లీ హారా-హింజే, బెంజమిన్ ఇటో-డేవిస్, అలెస్ట్ కడోవాకి-ఫ్లెమింగ్, కోహీ కుబోటా, జేక్ కుసుడా-నైర్న్, వటారు మియావుచి (వికెట్ కీపర్), రియో సకురానో-థామస్, అలెక్స్ షిరాయ్-పాట్‌మోర్ (వికెట్ కీపర్), షోమా సుగాయా-స్లేటర్, డెక్లాన్ సుజుకి-మెక్‌కోంబ్, సుయోషి తకాడా, ఇబ్రహీం తకాహాషి, మకోటో తానియామా, లాచ్లాన్ యమమోటో-లేక్.
🗣️ 𝗜𝘁'𝘀 𝗴𝗼𝗶𝗻𝗴 𝘁𝗼 𝗯𝗲 𝗮 𝘁𝗵𝗿𝗶𝗹𝗹𝗶𝗻𝗴 𝗮𝗻𝗱 𝗲𝘅𝗰𝗶𝘁𝗶𝗻𝗴 𝗺𝗮𝘁𝗰𝗵 𝗳𝗼𝗿 𝘂𝘀
— BCCI (@BCCI) September 21, 2026
🎥 #TeamIndia have arrived in Japan and Captain Shreyas Iyer @ShreyasIyer15 is looking forward to the historic one-off T20I 🇮🇳🤝🇯🇵@CricketJapan pic.twitter.com/PZUo9kiCQ9
