యువతకు సపోర్టుగా ఆర్ఎస్ ఎస్ చీప్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ తిప్పికొట్టారు. యువతకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. నిరసనకారులపై జరిగిన దాడులను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. జెన్ జెడ్ నిరసనకారులపై లాఠీఛార్జ్ ఘటనకు అమిత్ షా బాధ్యత వహించాలి.. పార్లెమెంట్ లో సమాధానం చెప్పాలి.. ఆయన ఎందుకు పార్లమెంట్ కు రావడం లేదని ప్రియాంకగాంధీ ప్రశ్నించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భయపడుతున్నారు.. అందుకే పార్లమెంట్ కు రాకుండా దాక్కున్నారని ఆరోపించారు. పేపర్ లీక్ వివాదం పై జరిగిన నిరసన సమయంలో విద్యార్థులపై పోలీసులు దురుసు ప్రవర్తనకు అమిత్ షా సమాధానం చెప్పాలని అన్నారు.
ALSO READ : ఈ 3 డిమాండ్లకు ఒకే అంటే...
ఇదిలా ఉండే ముంబైలో ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ జెన్ జెడ్ నిరసనలు, యువత ఆందోళనలు చేస్తే వారు దేశద్రోహులు కాదు..వారంతా మనవారే. వారు మన తర్వాతి తరం. వారితో చర్చలు, సత్సంబంధాలు అవసరం అని అన్నారు. విద్యావ్యవస్థపై యువత నిరసనలు సరైనవే ..జీడీపీలో విద్యా ఖర్చును 6శాతానికి పెంచాలని, ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.
