హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ జీడిమెట్లలో ఓ విచిత్రమైన దొంగతనం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శ్రీ సాయి మిల్క్ ఏజెన్సీలో ఒక యువకుడు వరుసగా పాల డబ్బాలను ఎత్తుకెళ్తున్న ఘటన కలకలం రేపింది. కేవలం పాల డబ్బాలే కాకుండా, అందులో ఉన్న పాల ప్యాకెట్లను సైతం ఆ దొంగ వదలకుండా దోచుకెళ్లాడు. గత నెల వ్యవధిలోనే పలుమార్లు ఈ చోరీలు జరగడంతో మిల్క్ ఏజెన్సీ యాజమాన్యం కంగుతింది.
అయితే దుకాణంలో సీసీ కెమెరా ఉందన్న విషయాన్ని ఆ నిందితుడు పూర్తిగా మర్చిపోయినట్లున్నాడు. ఏకంగా ఫేస్ క్లియర్‌గా పడేలా కెమెరాని నేరుగా చూస్తూ మరీ దొంగతనం చేయడం విశేషం. దీన్ని చూసిన స్థానికులు ఈ దొంగ పాలు కొనడానికి వచ్చాడా.. లేక సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి వచ్చాడా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.
వరుస దొంగతనాలతో విసిగిపోయిన మిల్క్ ఏజెన్సీ యాజమాన్యం ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ విచిత్ర దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
►ALSO READ | బిల్లు డబ్బుల కోసం 2 రోజుల పసికందును తల్లికి 9 గంటలు దూరం చేసిన హాస్పిటల్.. కోర్టు ఏం చేసిందంటే?
