వారఫలాలు:  ఈ వారంలో కొత్త సంవత్సరం ప్రారంభం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!

వారఫలాలు:  ఈ వారంలో కొత్త సంవత్సరం ప్రారంభం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!

 వారఫలాలు ( మార్చి 15–21): జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..  ఈ వారంలో మార్చి 19 వ తేదీ నుంచి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. కొన్ని గ్రహాలు వాటి స్థానాలు మారుతున్నాయి.  వీటి ప్రభావంతో ఈ వారం 12 రాశుల వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. . .!

మేష రాశి:  ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారస్తులు అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న వివాదాలు పరిష్కారమవుతాయి.   ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగస్తులు.. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

వృషభ రాశి:ఈ వారం  ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలున్నాయి.  వ్యాపారస్తులు భారీగా లాభాలు అందుకుంటారు. కొత్త వ్యాపారాలు కలసి వస్తాయి. ఉద్యోగస్తులకు అన్నీ విధాలుగా అనుకూలంగా ఉంటుంది. . వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.  కేరీర్​ పరంగా ఊహించని మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.  మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాల శుభ ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

మిధున రాశి: ఈ రాశి వారికి ఈ వారం  వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు. పెళ్లి సంబంధాలు చూసే వారు శుభవార్త వింటారు .స్నేహితుల వల్ల వృథా ఖర్చులు ఉంటాయి. 

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగులు హ్యాపీగా గడుపుతారు. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.  ఆర్థికంగా అభివృద్ది చెందుతారు. పెళ్లి ప్రయత్నాలు కలసి వస్తాయి.   ఉద్యోగస్తులకు కార్యాలయాలలో ప్రశాంతంగా గడుస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్త వింటారు. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దడంలో తల్లితండ్రుల సహకారం లభిస్తుంది. 

సింహరాశి: ఈ  వారం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి.   ఉద్యోగం మారాలనే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరంగా అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది. బంధువులు.. స్నేహితుల వలన గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి అనుకోని ఆర్డర్లు వస్తాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  అనుకోని ఖర్చులు రావడం.. బాధ్యతలు పెరగడం వంటి పరిణామాలు చోటు చోసుకొనే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు.

కన్య రాశి: ఈ రాశి వారు ఈ వారం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు చెబుతున్నారు.వృత్తి వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కకపోవడం వల్ల మీలో అసంతృప్తి నెలకొంటుంది.  ఈ వారంలో ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. అధికారుల మద్దతు తక్కువగా ఉంటుంది. పనిపై శ్రద్ధ పెట్టి ధైర్యంగా ఈ వారాన్ని పూర్తి చేసుకోండి. ప్రేమ వ్యవహారాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి
  
తులారాశి:  ఈ రాశి వారు ఈ వారం ఇతరులతో సమయస్ఫూర్తిగా మెలగాలి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకోండి.  ఖర్చులు అధికంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తంగా ఉండండి. ప్రేమ.. వివాహ ప్రయత్నాలు వాయిదా వేయండి సాగిస్తారు. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండంది.  ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. పెద్దల సలహాను ఆచరించేటప్పుడు అవి మీకు ఎంత వరకు ఉపయోగపడాతాయో చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆస్తి వివాదాలు, సమస్యల నుంచి కొద్దిగా గట్టెక్కుతారు.  అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని పండితులుసూచిస్తున్నారు. బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. 

ధనుస్సు రాశి : ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. ఉన్నతాధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి, అభివృద్ధి బాటపడతాయి.  ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.  ఖర్చుల  విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. సమాజంలో  గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 

మకర రాశి:ఈ రాశి వారు ఈ వారం కొత్త  పనులు ప్రారంభించే అవకాశం ఉంది.  ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పనికి పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది.  ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.   కొత్త వెంచర్​ లు ప్రారంభించే అవకాశం ఉంది.  ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండదు. సమయానికి ఆహారం తీసుకోండి.. అంతా మంచే జరుగుతుంది. 

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.  వ్యాపార పరంగా  ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొన్ని శుభవార్తలు వింటారు. కొత్త పెట్టుబడులు చేయాలని మీ ఆలోచన ముందుకు సాగుతుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది.పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది.ప్రేమవ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.

మీన రాశి: ఈ రాశి వారి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.  టెక్నికల్ రంగంలో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంపెనీలు తరఫున విదేశాలకు ట్రైనింగ్ ల కోసం వెళ్లే ఛాన్స్ మీకు లభించవచ్చు.వ్యాపారస్తులకు ఊహించని విధంగా  లాభాలు కలిసి వస్తాయి.  .హామీ సంతకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు హెచ్చరిస్తున్నారు

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.