నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం సినిమాల జాతర నడుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్ డ్రామాల వరకు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఇవి థియేటర్లలో కాసుల వర్షం కురిపించడమే కాదు.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా అత్యధిక వ్యూవర్ షిప్ తో దూసుకెళ్తున్నాయి. లేటెస్ట్ గా టాప్ 10 సినిమాల జాబితాను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో హాలీవుడ్ దిగ్గజాలు నటించిన ఒక సరికొత్త థ్రిల్లర్ ఏకంగా 4 కోట్ల (40.4 మిలియన్) వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది.
ది రిప్ (The Rip)
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్న సినిమా ' ది రిప్' (The Rip). ఈ సరికొత్త థ్రిల్లర్ ఏకంగా 4 కోట్ల (40.4 మిలియన్) వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది. మాట్ డామన్, బెన్ అఫ్లెక్ వంటి స్టార్ హీరోలు నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. మయామికి చెందిన కొందరు పోలీసులకు అనుకోకుండా కోట్ల కొద్దీ డాలర్లు దొరుకుతాయి. ఆ డబ్బుతో వారు ఏం చేశారు? ఆ నిర్ణయం వారి జీవితాలను ఎలా మార్చింది? అనే ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.
Also Read : హీరో రణ్‌వీర్ సింగ్‌పై FIR నమోదు!
కిడ్నాప్డ్: ఎలిజబెత్ స్మార్ట్ (Kidnapped: Elizabeth Smart)
నిజ జీవితంలో జరిగిన ఒక భయంకరమైన కిడ్నాప్ ఉదంతం ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ 'కిడ్నాప్డ్: ఎలిజబెత్ స్మార్ట్' (Kidnapped: Elizabeth Smart). 2002లో 14 ఏళ్ల ఎలిజబెత్ స్మార్ట్ తన ఇంటి నుంచే కిడ్నాప్‌కు గురైంది. ఆమె ఎదుర్కొన్న ఆ తొమ్మిది నెలల నరకాన్ని, ఆమె ధైర్యాన్ని స్వయంగా ఎలిజబెత్ మాటల్లోనే ఈ డాక్యుమెంటరీలో చూడవచ్చు. ప్రస్తుతం 15,900,000 వ్యూస్ తో రెండవస్థానంలో ఉంది.
నో టైమ్ టు డై (No Time to Die)
జేమ్స్ బాండ్ సిరీస్‌లో డేనియల్ క్రెయిగ్ నటించిన చివరి సినిమా 'నో టైమ్ టు డై' (No Time to Die) . రిటైర్మెంట్ తీసుకుని ప్రశాంతంగా గడుపుతున్న బాండ్‌ను ఒక పాత స్నేహితుడు సాయం కోరడంతో మళ్లీ గూఢచారి ప్రపంచంలోకి అడుగుపెడతాడు. యాక్షన్ ప్రియులకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం ఇది 9,600,000 వ్యూస్ తో మూడవ ప్లేస్ లో ఉంది..
పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్ (People We Meet on Vacation)
ఎమిలీ హెన్రీ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్' (People We Meet on Vacation) . ఈ మూవీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య సాగే అందమైన ప్రేమకథ. ప్రతి ఏడాది వేర్వేరు దేశాల్లో కలుసుకునే వీరు, తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదని తెలుసుకోవడానికి ఎన్ని ఏళ్లు పట్టిందనేదే ఈ సినిమా. ఇది నెట్ ఫ్లిక్స్ లో 9,300,000 వ్యూస్ తో కొనసాగుతోంది.
కే-పాప్ డెమన్ హంటర్స్ (KPop Demon Hunters)
కే-పాప్ డెమన్ హంటర్స్ (KPop Demon Hunters) వరుసగా 32 వారాలుగా టాప్ 10లో ఉందంటేనే ఈ యానిమేషన్ మూవీ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. పగలు పాటలు పాడుతూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించే ఒక అమ్మాయిల బ్యాండ్, రాత్రి పూట రాక్షసులను వేటాడి ప్రపంచాన్ని ఎలా కాపాడుతుందో ఇందులో చూడొచ్చు. దీనిలోని ఒక సాంగ్ వచ్చే నెల గ్రామీ అవార్డ్స్ రేసులో ఉండటం విశేషం. ఇప్పటి వరకు 7,000,000 వ్యూస్ ను సొంతం చేసుకుంది.
ది మాగ్నిఫిసెంట్ సెవెన్ (The Magnificent Seven)
2016లో వచ్చిన 'ది మాగ్నిఫిసెంట్ సెవెన్' (The Magnificent Seven) నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.. ఇది 1960లో వచ్చిన అదే పేరు గల క్లాసిక్ సినిమాకు రీమేక్. ఒక అవినీతి పారిశ్రామికవేత్త బారి నుండి తమ గ్రామాన్ని కాపాడుకోవడానికి రోజ్ క్రీక్ ప్రజలు ఏడుగురు గన్ ఫైటర్లను ఆశ్రయిస్తారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా సాగుతుంది . ప్రస్తుతం ఇది 6,500,000 వ్యూస్ తో దూసుకెళ్తోంది. భారీ తారాగణం, పదునైన సంభాషణలతో ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠ రేపుతుంది.
స్పెక్టర్ (Spectre)
స్టైలిష్ స్పై థ్రిల్లర్ 'జేమ్స్ బాండ్' సిరీస్‌లో డేనియల్ క్రెయిగ్ నటించిన నాలుగో చిత్రం స్పెక్టర్ (Spectre) . ఒక రహస్య సంస్థ నుండి వచ్చిన ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్ బాండ్‌ను ఒక భారీ కుట్రను ఛేదించేలా చేస్తుంది. గారెత్ మాలోరీ కొత్త 'M'గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన మొదటి సినిమా ఇది. బాండ్ తన గతాన్ని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో ఎదురయ్యే మలుపులు ఈ సినిమా ప్రత్యేకత. నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటివరకు 4,300,000 మంది వీక్షించారు.
మాక్స్ (Max)
'మాక్స్' (Max) ఒక భావోద్వేగభరితమైన సాహస గాథ. అఫ్ఘానిస్థాన్ యుద్ధంలో తన హ్యాండ్లర్ కైల్‌ను కోల్పోయిన 'మాక్స్' అనే మిలిటరీ కుక్కను, కైల్ కుటుంబమే దత్తత తీసుకుంటుంది. యుద్ధభూమిలో ఎదురైన చేదు అనుభవాల వల్ల మానసికంగా దెబ్బతిన్న ఆ శునకం, కైల్ తమ్ముడు జస్టిన్ ఎలా ఒకరినొకరు అర్థం చేసుకుని కోలుకున్నారనేదే ఈ చిత్ర కథాంశం. ఇప్పటివరకు ఈ చిత్రాన్ని ఓటీటీ లో 4,300,000 చూశారు.
తేరే ఇష్క్ మే (Tere Ishk Mein)
ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ మరియు ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన తేరే ఇష్క్ మే (Tere Ishk Mein) హిందీ చిత్రం రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాగా రూపొందింది. శంకర్ , ముక్తి అనే ఇద్దరి మధ్య సాగే గాఢమైన ప్రేమకథ ఇది. విమర్శకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీనెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం 3,800,000 వ్యూస్ ను క్రాస్ చేసింది.
'సూట్‌కేస్ కిల్లర్: ది మెలానీ మెక్‌గైరీ స్టోరీ' (Suitcase Killer)
2004లో అమెరికాను వణికించిన ఒక నిజజీవిత క్రైమ్ ఆధారంగా ఈ సూట్‌కేస్ కిల్లర్: ది మెలానీ మెక్‌గురై స్టోరీ (Suitcase Killer: The Melanie McGuire Story ) సినిమా తెరకెక్కింది. తన భర్త బిల్ మెక్‌గురైను దారుణంగా హత్య చేసి, శరీర భాగాలను మూడు సూట్‌కేసుల్లో పెట్టి సముద్రంలో పడేసిన మెలానీ మెక్‌గురై అనే నర్సు కథ ఇది. ఈమెకు 101 ఏళ్లు వచ్చే వరకు పెరోల్ లభించదంటే ఆమె చేసిన నేరం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. వెన్నులో వణుకు పుట్టించే ఒక యదార్థ గాథ ఇది ప్రస్తుతం 3,700,000 వ్యూస్ తో దూసుకెళ్తోంది.
