ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. 10 రోజుల్లోనే నలుగురికి నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో  సిట్ దూకుడు.. 10 రోజుల్లోనే నలుగురికి నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దూకుడు పెంచింది. గత నెలలో పలువురిని విచారించిన సిట్ జనవరిలో ఏకంగా నలుగురికి సిట్ నోటీసులిచ్చింది. వీరిలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్,రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. కేసీఆర్ మినహా మిగతా ముగ్గురిని జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో  సిట్ విచారించింది. వారి  స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసింది.ఈ కేసులో ఇవాళ జనవరి 29న కేసీఆర్ కు  సిట్ నోటీసులిచ్చింది..  రేపు (జనవరి 30) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరకావాలని సిట్ నోటీసుల్లో తెలిపింది. 

ఎవరు, ఎపుడు.?

జనవరి 19న హరీశ్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో  జనవరి 19న హరీశ్ రావుకు నోటీసులిచ్చింది సిట్. జనవరి 20న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్ లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు జనవరి 20న హరీశ్ ను దాదాపు 6 గంటల పాటు సిట్ విచారించింది. 

జనవరి 22న కేటీఆర్

జనవరి 22న కేటీఆర్ కు నోటీసులివ్వగా..23న ను సిట్ విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు సిట్ విచారణ జరిగింది.

జనవరి 26న సంతోష్ రావు

జనవరి 26న మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులివ్వగా..27న విచారణకు హాజరయ్యారు. దాదాపు 6 గంటల పాటు సంతోష్ ను  సిట్ విచారణ జరిపింది.

జనవరి 29న కేసీఆర్

జనవరి 29న  కేసీఆర్ కు సిట్ నోటీసులిచ్చింది. రేపు జనవరి(30)న మధ్యాహ్నం విచారణకు హాజరుకానున్నారు.

►ALSO READ | బీసీలపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదు: కవిత