అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్య డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ 

అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్య డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ 

లింగాల/వంగూరు, వెలుగు :  గ్రామీణ విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చంపేట ఎమ్మెల్య డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం లింగాల మండలం మాడాపూర్ గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న నూతన పాఠశాల భవనానికి స్థానిక సర్పంచ్ అంగోత్ శేఖర్‌‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే పాఠశాలల నిర్మాణం, రిపేర్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అనంతరం వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి, జాజాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని చెప్పారు.