మెగా లోన్లు రిలీజ్ చేసిన  ఇండియన్ బ్యాంక్..డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌.. బ్యాంకింగ్ సేవలు

మెగా లోన్లు రిలీజ్ చేసిన  ఇండియన్ బ్యాంక్..డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌.. బ్యాంకింగ్ సేవలు

హైదరాబాద్​ సిటీ, వెలుగు :  తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల్లో  ఇండియన్​ బ్యాంక్​ మెగా రామ్ (రిటైల్, అగ్రికల్చర్ , ఎంఎస్ఎంఈ) క్రెడిట్ అవుట్‌‌రీచ్ కార్యక్రమాన్ని  నిర్వహించి,    మొత్తం ₹1,422 కోట్ల విలువైన  లోన్లను లబ్ధిదారులకు మంజూరు చేసి, వెంటనే విడుదల చేసింది. తిరుపతిలో జరిగిన డిస్‌‌బర్స్‌‌మెంట్ ఈవెంట్‌‌లో ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేశ్​ కుమార్, జోనల్ మేనేజర్ సెల్వరాజ్ ఎం పాల్గొన్నారు. లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్లను అందజేశారు.  

 కస్టమర్ సెంట్రిక్​ లోన్​ పాలసీలను అమలు చేస్తూ..  డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌‌ల ద్వారా సులభంగా బ్యాంకింగ్ సేవలు  అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని వివిధ జోన్లలో ఈ కార్యక్రమాలు నిర్వహించామని ,  డీఆర్‌‌డీఏ, ఎంఈపీఎంఏ వంటి ప్రభుత్వ సంస్థల అధికారులు పాల్గొని ఆంట్రప్రెన్యూర్లకు, చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందిచామన్నారు.