చిత్ర పరిశ్రమలోని చిన్న సినిమాల స్థితిగతులపై నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆదివారం మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘చిన్న సినిమాలకు ముఖ్యంగా ప్రభుత్వ సపోర్ట్ కన్నా ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ చాలా అవసరం. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా మంచి సినిమాలు తీసే నిర్మాతల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించాలి. అలాగే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి ఒక కమిటీ వేసుకుని చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలి.
గతంలో ఇచ్చినట్టే చిన్న సినిమాలకు సబ్సిడీ ఇచ్చేలా ఆలోచన చేయాలి. సినిమా అయితే తీస్తున్నారు కానీ.. విడుదల విషయంలో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. చిన్న చిత్రాలను సపోర్ట్ చేస్తే ఆ నిర్మాతలు మరిన్ని సినిమాలు తీయగలుగుతారు. చిన్న నిర్మాతలే చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కులాంటివారు’ అని అన్నారు.
