బీసీలపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదు: కవిత

బీసీలపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదు: కవిత

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కులగణనపై చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జనగణన డాక్యుమెంట్ అసలు ఉద్దేశాన్ని బయటపెట్టిందని మాజీ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీకి ప్రత్యేక కాలమ్స్ పెట్టి, దేశంలో 56 శాతం ఉన్న ఓబీసీలను పక్కన పెట్టడం ద్వారా కులగణన పేరుతో భారత ప్రజలను మోసం చేస్తున్నారని రౌండ్ టేబుల్ సమావేశంలోమండి పడ్డారు.  జనగణన జరగకుండా ఏ వర్గం ఎంత ఉందో, వారికి బడ్జెట్, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలన్నది నిర్ణయించలేమన్నారు. బీజేపీ ప్రభుత్వం కుల గణనకు అంగీకరించడం ఆశ్చర్యం కలిగించిం దని, కానీ డాక్యుమెంట్ విడుదలతో వారి అసలు బుద్ధి బయటపడిందన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కులాల గుర్తింపు ఉంటుందని, చిన్న కులాలజీ ఇన్ని వైరుధ్యాలు ఉంటే, బీసీల విషయంలో గందరగోళం మరింత తీవ్రంగా ఉంటుందన్నారు. 

అందుకే తెలంగాణ ముంచిన ష్టమైన అభిప్రాయాన్ని కేంద్రానికి అందించాలనే లక్ష్యంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిం చామని చెప్పారు. కులగణన విషయంలో ప్రతి రాజకీయ పార్టీ తమ స్టాండ్ చెప్పాల్సిందేనని, ప్రజల హక్కుల విషయంలో మౌనం అనర్హమని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కులాల పేర్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయని కవిత వివరించారు. తనను ఉదాహరణగా తీసుకుంటే వెలను కులానికి తెలంగాణలో ఓసీగా, మహారాష్ట్రలో ఎస్సీగా, ఆంధ్రప్రదేశ్లో బీసీగా గుర్తింపు ఉందన్నారు. చిన్న సంఖ్యలో ఉన్న కులాలకే ఇంత గందరగోళం ఉంటే, దేశంలో 56 శాతం ఉన్న బీసీల విషయంలో ఎంత గందరగోళం ఉంటుందో ఆలోచించాల న్నారు. గతంలో అగ్రకులాల్లో పేదలకు రిజర్వే షన్లు ఇచ్చినప్పుడు కూడా వారు ఏ కేటగిరీలోకి వస్తాకో స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.

 ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని కమ్యూనిటీల ప్రతినిధులు హాజరయ్యారని, ఇక్కడి నుంచి వచ్చే అభిప్రాయాలు రిజర్వేషన్ల విషయంలో కేం దానికి సూచికగా ఉండాలన్నారు. కులగణనపై బీజేపీ ఇచ్చిన మాట తప్పిందన్నది స్పష్టంగా కనిపిస్తోందని, ఈ అంశంపై అన్ని రాష్ట్రాల్లో చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణ నుంచి కూడా బలమైన అభిప్రాయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. తె లంగాణలో ఉన్న కులాలు, ఉపకులాలపై సమగ్ర నివేదికను జాగృతి సిద్ధం చేస్తుందని చెప్పారు. కీలక అంశాల్లో రాజకీయ పార్టీల పాత్ర చాలా ముఖ్యమని, ప్రతి పార్టీ ఈ విషయంలో తమ స్ట్రాండ్ స్పష్టంగా చెప్పాల్పించేనన్నారు. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ అంశంపై మౌనంగా ఉన్నాయని, బీజేపీ మాత్రం తామే విడుదల చేసిన డాక్యుమెంటకు మద్దతుగా మాట్లాడుతోం దని పేర్కొన్నారు. చివరికి అన్ని పార్టీలు తమ స్పష్టమైన వైఖరి చెప్పాల్సిన అవసరం ఉందని కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు.