- 50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీ
- ముగ్గురు అరెస్టు
కూకట్పల్లి, వెలుగు: దూరపు బంధువని జాలిపడి ఓ మహిళకు ఇంట్లో ఆశ్రయమిస్తే రూ. 50 లక్షల విలువైన బంగారు , వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన బాలానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. బాలానగర్ ఏసీపీ నరేశ్‌రెడ్డి వివరాల ప్రకారం.. యర్రమిల్లి హిమబిందు తన కుటుంబంతో కలిసి ఆదర్శనగర్‌లో ఉంటుంది.
ఈమెకు దూరపు బంధువైన చెరుకుపల్లి లక్ష్మిసర్వాణి కొద్ది రోజుల క్రితం హిమబిందు వద్దకు వచ్చి, తాను సమస్యల్లో ఉన్నానని, ఆదుకోవాలని కోరింది. దీంతో ఆమె చేదోడువాదోడుగా ఉంటుందని హిమబిందు లక్ష్మికి ఆశ్రయం ఇచ్చింది. ఇలా కొన్ని రోజులు గడిచాక.. శనివారం మధ్యాహ్నం ఇంటి ఓనర్లకు మత్తులో మందు ఇచ్చింది.
అనంతరం పర్వతం కిరణ్‌కుమార్, కొనవర్తి యశ్వంత్ , భారడి దిలీప్ , శివతో పిలిచి చోరీకి పాల్పడింది. బాధితుల ఫిర్యాదు తో పోలీసులు 24 గంటల్లో కేసు చేధించారు. డేటాతో లక్ష్మితోపాటుముగ్గురిని అరెస్ట్ చేయగా.. శివ పరారీలో ఉన్నాడు.
