47 సెకన్లలో14 కత్తిపోట్లు..డిగ్రీ విద్యార్థినిపై కిరాతకుడి దాడి

47 సెకన్లలో14 కత్తిపోట్లు..డిగ్రీ విద్యార్థినిపై కిరాతకుడి దాడి

ఏంటీ దారుణం.. 47 సెకన్లలో14 కత్తిపోట్లు..పట్టపగలు అందరూ చూస్తుండగానే  డిగ్రీ విద్యార్థినిపై కిరాతకంగా దాడి..తీవ్రమైన కత్తిపోట్లతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆ అమ్మాయి. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని లో శుక్రవారం అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. 

శుక్రవారం(జూన్ 26) ఎంపీలోని ఉజ్జయినిలో డిగ్రీ చదువుతున్న 19 ఏళ్ల   కాలేజీ విద్యార్థినిపై  ఓ యువకుడు  కత్తితో దాడి చేసిన ఘటనకు చోటు చేసుకుంది. నడిరోడ్డుపై విద్యార్థిని అడ్డగించి  47 సెకన్లలో 14 సార్లు కత్తితో పొడిచాడు.  కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలింది. ఈ దారుణానికి సంబందించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో నిందితుడు 21ఏళ్ల సునీల్ జరోలియాను  పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడి దాడిలో బాధితురాలి మెడ, కడుపు,  చేతులకు తీవ్రగాయాలయ్యాయి .

►ALSO READ | కేతన్కు బట్టతల.. విగ్గు పెట్టుకోవటం నచ్చలేదు : హత్యకు కారణాల్లో ఇది కూడా ఉందంట..!

నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుందామని  అడిగితే తిరస్కరించిందని గత కొద్దిరోజులుగా తనను దూరం పెట్టిందని ప్రేమను తిరస్కరించినందుకే కత్తితో దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దాడి తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో గోడ దూకడంతో నిందితుడి కాలు విరిగిపోయింది.