ఫుణె హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కేతన్ అగర్వాల్ తరపున 26/11 స్పెషల్ ప్రాసిక్యూటర్

ఫుణె హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కేతన్ అగర్వాల్ తరపున 26/11 స్పెషల్ ప్రాసిక్యూటర్

పుణెలో  హత్యకు గురైన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కేతన్ అగర్వాల్ కుటుంబం తరపున వాదించేందుకు 26-11 ముంబై పేలుళ్ల కేసు వాదించిన సీనియర్ లాయర్ఉజ్వల్ నికమ్ ను ముందుకు వచ్చారు. శుక్రవారం  కేతన్ అగర్వాల్ కుటుంబాన్ని కలిసిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలిశారు. కేతన్ కుటుంబ సభ్యుల విజ్ణప్తి మేరకు ఉజ్వల్ నికమ్ ను లాయర్ గా నియమించేందుకు హామీ ఇచ్చారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

జూన్ 18 న లోహగడ్ కోట దగ్గర కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడి చేతిలో కేతన్ అగర్వాల్ దారుణంగా హత్యకు గురయ్యాడు. పథకం ప్రకారమే కేతన్ ను లోయలోకి తోసి ప్రమాదం చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు. అయితే  అనుమానం వచ్చిన పోలీసులు.. లోతుగా విచారణ జరపడంతో అసలు నిజాలుబయటికి వచ్చాయి. కేతన్ అగర్వాల్ ప్రియుడితో కలిసి లోయలో తోసి హత్య చేసేందుకు ముందుగా ప్లాన్ చేసినట్లు సియా గోయల్ ఒప్పుకుంది.