జాదవ్ కు చిన్నచిన్న పిల్లలున్నారు..ఏ కుటుంబానికి ఇలాంటి కష్టం రాకూడదు..అజిత్ పవార్ బాడీగార్డ్ బంధువులు 

జాదవ్ కు చిన్నచిన్న పిల్లలున్నారు..ఏ కుటుంబానికి ఇలాంటి కష్టం రాకూడదు..అజిత్ పవార్ బాడీగార్డ్ బంధువులు 

మహారాష్ట్రలోని బారామతివిమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ తోపాటు మరో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు ఎయిర్​ క్రాఫ్ట్​ సిబ్బంది, ఒకరు అజిత్​ పవార్​ వ్యక్తిగత సహాయకురాలు కాగా.. మరో వ్యక్తి ఆయన బాడీగార్డ్​విదిప్​ దిలీప్​ జాదవ్​ ఉన్నారు. జాదవ్​ కు భార్య ఇద్దరు పిల్లలున్నారు. జాదవ్​ మరణంతో ఆయన స్వస్థలం థానేలోనికల్వాలలోని విటావాలో విషాద ఛాయలు అలముకొన్నాయి.  జాదవ్​ చనిపోయాడన్న విషయాన్ని ఆ ప్రాంతంలోని ప్రజలు జీర్ణించుకోలేపోయారు. 

విమాన ప్రమాదం దురదృష్టకరం.. అనుకోని ప్రమాదం జాదవ్​ కుటుంబాన్ని వీధిన పడేసింది.. జాదవ్​ కు చిన్న చిన్న పిల్లలున్నారు.. వారి జీవితాల్లో తీవ్ర విషాదం నింపింది..ఏ కుటుంబానికి కూడా ఇలాంటి పరిస్తితి రాకూడదని అతని ఇంటి పక్కన ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నవారు విచారం  వ్యక్తం చేశారు.  జాదవ్​ అజిత్ పవార్​ బాడీగార్డుగా పనిచేస్తున్నప్పటికీ  అతని ఉద్యోగం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు.. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా పబ్లిసిటీ కోరుకోలేదనిస్థానికులు చెబుతున్నారు. 

మహారాష్ట్రలో అత్యంత సీనియర్​ రాజకీయ నేతలలో ఒకరి భద్రతను చూస్తున్నప్పటికీ జాదవ్​ అందరితో వినయంగా, మృదువుగా మాట్లాడే వాడని, దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి అని గుర్తు స్థానికులు చేసుకున్నారు. జాదవ్​ మరణం వార్త మొదట అతని భార్య పిల్లలు తెలియలేదు. విషాద ఘటనలో జాదవ్​ మృతిచెందాడని తెలియగానే అతని భార్య పిల్లలు దుఖసాగరంలో మునిగిపోయారు.