టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఒక కలలా జరిగిపోయింది. ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న అట్టహాసంగా జరిగిన పెళ్లి వేడుకలో ఒక్కటైంది ఈ జంట. ఇప్పుడు తమ వెడ్డింగ్ మెమొరీస్‌ను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా వారు షేర్ చేసిన 'హల్దీ' వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హల్దీ కాదు.. అంతకు మించి!
సాధారణంగా హల్దీ వేడుక అంటే పసుపు రాసి, మంగళ స్నానాలు చేయిస్తారు. కానీ రౌడీ హీరో పెళ్లి అంటే ఆ మాత్రం రచ్చ ఉండాలి కదా! ఈ వేడుక గురించి రష్మిక స్పందిస్తూ.. "అది కేవలం హల్దీ మాత్రమే కాదు, హల్దీ, హోలీల కలయికలా జరిగింది" అని చెప్పుకొచ్చింది. రంగులు, నీళ్లతో ఒకరినొకరు ఎంతలా ముంచెత్తారంటే.. ఆ రంగుల అల్లరిలో తన జుట్టుకు అంటుకున్న ఎరుపు రంగు ఇంకా వదలలేదని రష్మిక సరదాగా పేర్కొంది.
విజయ్ కూడా తన అల్లరిని గుర్తు చేసుకుంటూ.. "ఆ రోజు సంగీత్ పార్టీ వల్ల సరిగ్గా నిద్ర లేకపోయినా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో గడపాలనే ఉత్సాహం మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. నేను ఎంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్న కుర్తా కూడా ఆ రంగుల నీళ్ల వల్ల పాడైపోయింది" అంటూ ఆ అల్లరి స్థాయిని వివరించాడు.
విజయ్ కూడా 'టీమ్ బ్రైడ్' లోనేనా?
ఈ వేడుకలో జరిగిన కొన్ని సరదా ఆటల గురించి రష్మిక ఒక క్యూట్ సీక్రెట్‌ను బయటపెట్టింది. పెళ్లి వేడుకల్లో అమ్మాయి తరపు వారు, అబ్బాయి తరపు వారు విడివిడిగా పోటీ పడటం సహజం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, స్వయంగా వరుడు విజయ్ (విజ్జు) కూడా రష్మిక టీమ్‌లో చేరిపోయి ఆమె గెలవడానికి సహాయం చేశాడట! "ఆ రోజు జరిగిన అన్ని ఆటల్లోనూ నా 'టీమ్ బ్రైడ్' గెలిచింది. దానికి కారణం విజ్జు కూడా నా టీమ్‌లోనే ఉండటం" అంటూ రష్మిక రాసుకొచ్చిన క్యాప్షన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
డెస్టినేషన్ వెడ్డింగ్.. !
విదేశాల్లో పెళ్లి చేసుకునే ట్రెండ్ నడుస్తున్నా, విజయ్ మాత్రం తన వివాహం మన దేశంలోనే జరగాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్‌ను వీరు ఎంచుకున్నారు. 200 ఎకరాల విస్తీర్ణంలో, చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి మధ్య ఉన్న ఈ ప్రదేశం తమ పెళ్లికి ఒక దివ్యమైన అనుభూతిని ఇచ్చిందని ఈ జంట తెలిపింది. అక్కడి ఆతిథ్యం, ఫుడ్ , వాతావరణం పట్ల వారు ప్రశంసలు కురిపించారు.
తమ డ్రెస్సులను అద్భుతంగా డిజైన్ చేసిన ఫేమస్ డిజైనర్ అనామికా ఖన్నాకు కూడా ఈ జంట ధన్యవాదాలు తెలిపింది. "ఇది మా ప్రయాణానికి ఒక అందమైన మొదలు మాత్రమే" అంటూ రష్మిక తన భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను ముగించింది. ప్రస్తుతం 'విరష్' (ViRash) హ్యాష్ ట్యాగ్‌తో ఈ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
Haldi.
— Rashmika Mandanna (@iamRashmika) March 16, 2026
It was more like Haldi + Holi. 🤍
We were drenched and dipped in colour so much so that even now my hair still carries a bit of red in it. 😄😄
And PS: I won all the games that day with the incredible help of my Team Bride! 🐒🐒 Just FYI.. even Vijju was Team Bride that… pic.twitter.com/ricXDx9SwK
