FIFA World Cup: ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం.. ఫిఫా వరల్డ్ కప్ ఆడాలని టెహ్రాన్ నిర్ణయం

FIFA World Cup: ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం.. ఫిఫా వరల్డ్ కప్ ఆడాలని టెహ్రాన్ నిర్ణయం

FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ 2026 నుంచి ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ టీమ్ తప్పుకుంటుందని వస్తున్న ప్రచారాన్ని ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ) క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై తమకు ఇరాన్ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని ఈరోజు ( మార్చి 16న) స్పష్టం చేసింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్‌కు టెహ్రాన్ ఇప్పటికే అర్హత సాధించింది. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన అనంతరం ఈ ప్రచారం స్టార్ట్ అయింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారని వార్తలు రావడంతో.. తమ జట్టు ప్రపంచకప్ లో పాల్గొనడం కష్టమేనని ఆ దేశ క్రీడాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యాలు గందరగోళం రేపాయి. 

ఈ పరిణామాలపై ఏఎఫ్‌సీ జనరల్ సెక్రటరీ విండ్సర్ జాన్ మాట్లాడుతూ.. ఇది చాలా భావోద్వేగపూరితమైన సమయం.. చాలా మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు.. కానీ ఆడాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్యేకు ఉందని పేర్కొనింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, టెహ్రాన్ వరల్డ్ కప్‌లో పాల్గొంటున్నట్టు మాకు చెప్పారు. వాళ్లు మా సభ్యులు, వారు ఆడాలని మేము బలంగా కోరుకుంటున్నాం.. వారి సమస్యలు పరిష్కరించుకుని ఈ మెగా టోర్నమెంట్లో పాల్గొంటారని ఆశిస్తున్నామని వెల్లడించారు. 

మరోవైపు, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ టీమ్ తీవ్రంగా ఖండించింది. ఫిఫా నిర్వహించే టోర్నమెంట్‌లో పాల్గొనకుండా తమను అడ్డుకునే అధికారం ఏ దేశానికీ లేదని పేర్కొనింది. వరల్డ్ కప్ 2026 అనేది ఒక చారిత్రాత్మక టోర్నీ.. దీనికి నిర్వాహక సంస్థ ఫిఫానే తప్ప ఏ దేశం కాదన్నారు. మమ్మల్ని ఎవరూ ప్రపంచ కప్ నుంచి తప్పించే అవకాశం లేదని ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఒకవేళ ఇరాన్ అధికారికంగా తప్పుకుంటే, ఈ ఆధునిక శకంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది.