హైదరాబాద్: మాదాపూర్ పరిధిలోని చంద్ర నాయక్ తండాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా మీరన్‌పూర్ ప్రాంతం సిఖ్రేడా గ్రామానికి చెందిన అర్చనా చౌదరి మాలిక్ (29) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె మాదాపూర్ మైండ్‌స్పేస్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏంటనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదు. పని ఒత్తిడి లేదా ప్రేమ వ్యవహారం లేదా అప్పుల బాధ, అనారోగ్య సమస్యలు ఈ మూడు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోలేక చిన్న చిన్న సమస్యలకే భయపడిపోయి ఆత్మహత్యలకు పాల్పడేవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువవుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం, జీవితంలో పెరిగిపోతున్న యాంత్రికత, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్నాయనేది మానసిక విశ్లేషకుల అభిప్రాయం.
వార్తాపత్రిక తెరిచినా.. టీవీలో వార్తలు చూసినా ప్రతిరోజూ కామన్ గా కనిపించే వార్తల్లో ఆత్మహత్య ఒకటి. సెలబ్రిటీల నుంచి సాధారణ గృహిణుల వరకు.. రైతుల నుంచి విద్యార్థుల వరకు ఇలా ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతూ తమ కుటుంబాలకు తీరని వేదనను మిగులుస్తున్నారు.
