తెలంగాణ వ్యాప్తంగా స్వీట్ తయారీ కేంద్రాల్లో TG SAFE అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్టోబర్ 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 53 స్వీట్ల తయారీ, విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు అధికారులు. కొన్ని సంస్థల్లో అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్ల తయారు చేసి నిల్వ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు అధికారులు. కొన్ని చోట్ల ఆహార వ్యర్థాలతో పూడుకుపోయిన డ్రైనేజీలు.. అపరిశుభ్రంగా వాషింగ్ ఏరియాలు గుర్తించామని తెలిపారు అధికారులు.
పలు స్వీట్ షాపుల్లో దుమ్ము, ఆహార వ్యర్థాలతో మురికిగా మారిన గోడలు, హెయిర్‌నెట్స్, గ్లౌజులు లేకుండానే ఆహార పదార్థాల తయారు చేస్తున్నారని.. జిడ్డుతో నిండిన ఎగ్జాస్ట్‌లు, చిమ్నీలు గుర్తించామని తెలిపారు అధికారులు.కొని చోట్ల నేలపైనే ఆహార పదార్థాల నిల్వ చేస్తున్నారని.. ఆహార, ఇతర వస్తువులను కలిపి ఉంచుతున్నారని తెలిపారు అధికారులు.
చాలా చోట్ల పెస్ట్ కంట్రోల్, ఫుడ్ హ్యాండ్లర్ల ఆరోగ్య రికార్డులు నిర్వహించట్లేదని.. కల్తీ అనుమానంతో 38 ఆహార నమూనాలు సేకరించామని తెలిపారు TG SAFE అధికారులు.
నిబంధనల ఉల్లంఘనలపై 20 సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశామని.. ఒక సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేశామని తెలిపారు అధికారులు. లోపాలను సరిదిద్దుకున్నారా లేదా అని మళ్లీ తనిఖీలు నిర్వహిస్తామని.. నిబంధనలు పాటించకపోతే జరిమానాలు విధిస్తామని తెలిపారు అధికారులు.
