ఇండియాకు గుడ్ న్యూస్.. హార్మూజ్ నుంచి సేఫ్‎గా బయటపడ్డ మరో భారత నౌక

ఇండియాకు గుడ్ న్యూస్.. హార్మూజ్ నుంచి సేఫ్‎గా బయటపడ్డ మరో భారత నౌక

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఇండియాకు గుడ్ న్యూస్. రణరంగంగా మారిన హార్మూజ్ జల సంధి నుంచి భారత చమురు నౌక సురక్షితంగా బయటపడింది. సోమవారం (మార్చి 16) సాయంత్రం నాటికి ఓడ ఇండియా రీచ్ అవుతోంది. వచ్చే నౌకలో 54 వేల టన్నుల ఎల్పీజీ లోడ్ ఉంది. ప్రస్తుతం గ్యాస్ కొరత వేళ ఈ భారీ స్థాయి గ్యాస్ ప్రజలకు కాస్త ఊరట కలిగించనుంది.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో హార్మూజ్ జల సంధిలో చమురు నౌకలు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. ఓడలు ముందు కదిలే పరిస్థితి లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా హార్మూజ్ జల సంధిని దిగ్భంధనం చేసింది ఇరాన్. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వం రంగంలోకి సమర్థవంతమైన దౌత్యాన్ని ప్రదర్శించింది. ఇరాన్ గుండా భారత నౌకలు ప్రయాణించేందుకు లైన్ క్లియర్ చేసింది. భారత జెండాతో ఉన్న ఎల్పీజీ  క్యారియర్ శివాలిక్ హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

పెర్షియన్ గల్ఫ్ నుంచి 54 వేల టన్నుల ఎల్పీజీ లోడ్‎తో బయలుదేరిన శివాలిక్ నౌక సోమవారం (మార్చి 16) సాయంత్రం ఇండియాకు రీచ్ అవుతుందని వెల్లడించింది. నౌక్ భారత పోర్టుకు చేరుకోగానే ఎలాంటి ఆలస్యం లేకుండా సరుకు అన్ లోడ్ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

 ప్రస్తుతం హార్మూజ్ జల సంధిలో భారత్ కు చెందిన 22 చమురు నౌకలు ఉన్నాయని.. అవన్నీ సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. అలాగే.. దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని.. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించింది. అన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ స్టాక్‌ ఉందని తెలిపింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని చెప్పింది.