తెలంగాణలో పలు చోట్ల వడగండ్ల వాన..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో పలు చోట్ల వడగండ్ల వాన..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగ పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన  వడగండ్ల వాన పడుతోంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో వడగండ్ల  వర్షం పడుతోంది.  కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కురుస్తోంది. రాళ్ల వర్షం కురవడంతో  పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.  సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం, మెదక్ జిల్లా నర్సాపూర్, శివ్వంపేటలో గాలి దుమారంతో కూడిన వర్షం పడుతోంది. 

మరో వైపు తెలంగాణలో రాబోయే  రెండు గంటలు ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  మెదక్, సంగారెడ్డి, జిల్లాలలో గంటకు 41 నుంచి 61 కి.మీ  వేగంతో (గాలులు) ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు వచ్చే అవకాశం ఉంది. 

ఎల్లో అలర్ట్.. 

ఆదిలాబాద్, హైదరాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, జిల్లాలలో  తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.  గంటకు 40 కి.మీ కంటి తక్కువ (గాలులలో) తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది.

నాలుగు రోజులు వర్షాలు

తెలంగాణకు ఇవాళ్టి నుంచి( మార్చి 16) వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.   మార్చి16 , 17న తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు ,30 నుండి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మార్చి 16 న 17 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అదిలాబాద్,  కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ,రంగారెడ్డి ,హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ ,సంగారెడ్డి ,మెదక్, కామారెడ్డి  జిల్లాలకు వర్ష సూచన చేసింది.