మీరైనా రండి.. లేకపోతే మేం వస్తాం : కేసీఆర్ కు సిట్ నోటీసులు

మీరైనా రండి.. లేకపోతే మేం వస్తాం : కేసీఆర్ కు సిట్ నోటీసులు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు కేసీఆర్ ఇంటికి వెళ్లారు. కేసీఆర్ నందినగర్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. ఈ సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు. దీంతో.. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో నోటీసులు ఇచ్చి సిట్ అధికారులు వెళ్లిపోయారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ అధికారులు నోటీసులలో బీఆర్ఎస్ అధినేతకు స్పష్టం చేశారు.

కేసీఆర్ వయసు రీత్యా విచారణ నిమిత్తం పీఎస్కు రావాల్సిన అవసరం లేదని.. విచారణకు ఇంట్లో సిద్ధంగా ఉండాలని సిట్ తెలిపింది. రావాలనుకుంటే పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు హాజరు కావొచ్చని కూడా సిట్ నోటీసులలో పేర్కొంది. CRPC 160 కింద కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సన్నిహితులను, కుటుంబ సభ్యులను సిట్ అధికారులు ఇప్పటికే విచారించారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారించింది.