ఎప్ స్టీన్ ఫైల్స్, అదానీపై కేసుల వల్లే అమెరికాతో ట్రేడ్ డీల్ : కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివంత్ రెడ్డి

ఎప్ స్టీన్ ఫైల్స్, అదానీపై కేసుల వల్లే అమెరికాతో ట్రేడ్ డీల్ : కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివంత్ రెడ్డి
  •     కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువజన కాంగ్రెస్ నిరసన
  •     తెలంగాణ నుంచి భారీగా హాజరైన పార్టీ నేతలు

న్యూఢిల్లీ, వెలుగు: ఎప్ స్టీన్ ఫైల్స్, అదానీపై కేసుల వల్లే అమెరికా, భారత్ ట్రేడ్ డీల్ కుదిరిందని తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివంత్ రెడ్డి అన్నారు. ఈ డీల్‌‌‌‌‌‌‌‌ను నిరసిస్తూ సోమవారం ఢిల్లీ జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాతీయ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ నేతలు పాల్గొని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

అనంతరం శివంత్ రెడ్డి మాట్లాడుతూ..అమెరికా న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో గౌతమ్ అదానీపై కేసుల విచారణ వేగంగా జరుగుతుండటం, అలాగే ఎప్‌‌‌‌‌‌‌‌ స్టీన్‌‌‌‌‌‌‌‌ ఫైల్స్‌‌‌‌‌‌‌‌లో సమాచారం బయటకు వస్తున్న నేపథ్యంలో కేంద్రం అమెరికాతో ట్రేడ్ డీల్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ఒప్పందంతో భారత మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు రావడం వల్ల దేశంలోని కోట్లాది మంది రైతుల జీవనోపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ రహస్య ఒప్పందంపై దేశ ప్రజలకు వాస్తవాలు|చెబుతామన్నారు.