స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఇటీవల ముంబైలో కాస్ట్యూమ్ డిజైనర్ ఏక లఖాని వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో నటుడు-దర్శకుడు పార్థిబన్ కుమార్తె, మాజీ బాలనటి కీర్తనతో కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫొటోలను త్రిష తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి.
ఈ సందర్భంగా త్రిష గ్రూప్ సెల్ఫీని షేర్ చేస్తూ “The Gen Z’s and I” అనే క్యాప్షన్తో చమత్కరింది. అదేవిధంగా, ఆమె కీర్తనతో క్లోజ్‌గా ఉండే మరొక ఫోటోలో కూడా కనిపించడంతో విషయం మరింత హాట్ టాపిక్గా మారింది.
ఇటీవల పార్థిబన్ వివాదం నేపథ్యంలో త్రిష షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వెంటనే ఈ సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే త్రిష తనపై వచ్చిన విమర్శలను పెద్ద మనసుతో పక్కన పెట్టిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
అసలేం జరిగింది:
విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన తరుణంలో, ఇటీవల జరిగిన ఒక రిసెప్షన్ వేడుకలో విజయ్, త్రిష కలిసి కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ కలిసి ఒకే కారులో రావడం, వేదికపై నూతన వధూవరులను విష్ చేయడం, ఫోటోలకు కలిసి పోజులివ్వడం వంటివి వైరల్ అయ్యాయి.
ఇదే సమయంలో పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల జరిగిన ఒక సినీ అవార్డు ఫంక్షన్ లో ఆర్. పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఒక అవార్డు వేడుకలో త్రిష ఫోటోను చూపిస్తూ.. 'పొన్నియిన్ సెల్వన్'లోని ఆమె పాత్రను ఉద్దేశించి ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు.
ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రాకూడదు. అలా చేస్తే ఎలాంటి సమస్యలు రావు అని అన్నారు. ఇది విజయ్-త్రిషల డేటింగ్ వార్తలను పరోక్షంగా టార్గెట్ చేసినట్లు ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే తరుణంలో పార్థిబన్ సారీ కూడా చెప్పారు. ఇలాంటి ఈ పరిణామంలో త్రిష.. పార్థిబన్ కుమార్తె, కీర్తన కలిసి ఉండటంతో తమిళనాట హాట్ టాపిక్గా మారింది.
