అది తుపాకీ.. ఫుల్ లోడెడ్.. తుపాకీతో సరదాగా రీల్స్ చేస్తున్నాడు.. తుపాకీతో ఫోజులు ఇచ్చాడు.. సినిమాల్లో హీరో లెక్క.. సినిమాల్లో పోలీస్ లెక్క.. తుపాకీతో స్టయిల్గా ఫోజులు ఇస్తు్న్నాడు.. వీడియో తీస్తున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తి కూడా అతనికి సూచనలు ఇస్తూ.. అప్రమత్తం చేస్తున్నారు..
తుపాకీని గుండెలపై పెట్టి ఫోజులు ఇస్తు్న్న సమయంలో.. ఆ తుపాకీ పేలింది. అంతే.. తూటా గుండెలను చీల్చుకుంటూ వెళ్లింది. స్పాట్లోనే ఆ యువకుడు కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు.. అప్పటికే చనిపోయాడు.. రీల్స్ పిచ్చిలో.. తుపాకీతో గుండెల్లో కాల్చుకున్న ఈ కుర్రోడి వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ అశోక్ నగర్‌లోని దల్లుపురా ప్రాంతంలో పవన్ అనే యువకుడు తన కజిన్ హిమాంశుకు చెందిన లైసెన్స్డ్ పిస్టల్‌ను సరదాగా రీల్ చేస్తానని తీసుకున్నాడు. సినిమాలో హీరోలా ఫీల్ అయి పోయి.. గన్ లోడ్ చేశాడు. అంతటితో ఆగలేదు. తన ఛాతీకి ఆనించుకుని ట్రిగ్గర్ లాగడంతో దెబ్బకి తుపాకీ గుండు అతని గుండెల్లోకి దూసుకుపోయింది. స్పాట్ లోనే పవన్ కుప్పకూలి కింద పడిపోయాడు. తుపాకీ పక్కన పడింది. పవన్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేశారు. పవన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. పవన్ కావాలనే కాల్చుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
క్రైమ్ బృందం, ఫోరెన్సిక్ బృందం ఆసుపత్రిని, సంఘటనా స్థలాన్ని తనిఖీ చేశాయి. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ఎల్‌బిఎస్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనా స్థలంలో దర్యాప్తు జరిపిన అనంతరం.. పవన్ తన బంధువుకు చెందిన లైసెన్స్ ఉన్న పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ లైసెన్స్డ్ గన్తో పాటు 10 బులెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో రికార్డ్ అయిన హిమాంశు మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
New Delhi - A shocking incident in Delhi's Dallupura area claimed the life of a young man named Pawan, who died from an accidental self-inflicted gunshot wound while attempting a dangerous stunt for a video. pic.twitter.com/jOcGaypKQB
— NextMinute News (@nextminutenews7) March 17, 2026
