పోలీసులపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే పాడి..ఒక్కొక్కని సంగతి చూస్తా అంటూ వార్నింగ్

పోలీసులపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే పాడి..ఒక్కొక్కని సంగతి చూస్తా అంటూ వార్నింగ్

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి  రెచ్చిపోయారు. పచ్చిబూతులు తిడుతూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఒక్కొక్కని సంగతి చూస్తా అంటూ బెదిరించారు. అసభ్యకరమైన పదజాలంతో సీపీని దూషించారు.  గతంలో కూడా జూబ్లీహిల్స్ లోనూ..హుజురాబాద్ లోనూ పోలీసులకు పాడి వార్నింగ్ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే.?

కరీంనగర్ జిల్లా  వీణ వంక లోకల్ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తుంటే పోలీస్ లు తమను  అడ్డుకున్నారని  తన కుటుంబంతో కలిసి హుజరాబాద్ లో రోడ్డుపై పాడి కౌశిక్ రెడ్డి  బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించిన పాడి కౌశిక్ రెడ్డిని, బీఆర్ఎస్ కార్యకర్తలను  తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా  పోలీసులతో  వాగ్వాదానికి దిగారు. ఇష్టానుసారంగా బూతులు తిడుతూ రెచ్చిపోయారు. 

‘మీ కంటే  రేపు భవిష్యత్తులో పెద్ద పొజిషన్ లో ఉంటా. మీ కంటే ఎక్కువ పవర్ నాకు ఉంటుంది.నా ఇంట్లో పండగ లేకుండా చేస్తున్నారు. నాపైన ఎన్ని కేసులైనా పెట్టుకోండి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కని సంగతి చూస్తా.  వీణవంకలో సమ్మక్క పండగ చేసుకోకుండా అడ్డుకున్నారు’  అని  సీఐకి కూడా  వార్నింగ్ ఇచ్చారు.  కరీంనగర్ సీపీ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి. 

►ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. 10 రోజుల్లోనే నలుగురికి నోటీసులు