నాగర్‌‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు లో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

నాగర్‌‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు లో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  నాగర్‌‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆదివారం నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్​కు చెందిన పలువురు సర్పంచులు, నేతలు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిజినపల్లి మండలం బొరుసు తండా సర్పంచ్ లలిత రవి నాయక్, గంగారం పెద్ద తండా సర్పంచ్ గోపాల్ నాయక్, పాలెం మాజీ సర్పంచ్ బుర్రి యాదవ రెడ్డి, తిమ్మాజిపేట మండలం వేముల నాయక్ తండా సర్పంచ్ కేతావత్ కృష్ణ కుమార్, తాడూరు మండలం బలన్ పల్లి సర్పంచ్ భారతమ్మ నరసింహలతో పాటు పలువురు వార్డు సభ్యులు, నాయకులకు ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే నేతలు పార్టీలో చేరుతున్నారని, ప్రజల మద్దతు తమకే ఉందని స్పష్టం చేశారు. అనంతరం తెలకపల్లి మండలం లక్నారం, నాగర్‌‌కర్నూల్ మండలం పెద్ద ముదునూరు గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.