పెళ్లైన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య

పెళ్లైన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య

పెళ్లి అయిన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చోసుకుంది. వివరాల ప్రకారం.. బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన అనూష(20)కు రెండు నెలల క్రితం రాజశేఖర్‎ అనే యువకుడితో వివాహం జరిగింది. ఏమైందో తెలియదు గానీ గురువారం (జనవరి 29) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‏కు ఉరి వేసుకుని అనూష ఆత్మహత్యకు పాల్పడింది. 

ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి బంధువులు, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై బీబీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లైన రెండు నెలలకే కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

►ALSO READ | నాంపల్లి ఘటనపై హైడ్రా సీరియస్.. స్టాండర్డ్ ఫర్నిచర్ షాపు సీజ్..