న్యూజిలాండ్ తో జరుగుతున్న నాలుగో టీ20 లో ఇషాన్ కిషాన్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కలేదు. సూపర్ ఫామ్ లో ఉన్న కిషాన్ కు తప్పించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. కిషాన్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తొలి టీ20లో 8 పరుగులే చేసి విఫలమైనా రెండో టీ20 లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 32 బాల్స్‌లోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఆదివారం (జనవరి 25) జరిగిన మూడో టీ20లోనూ 12 బంతుల్లోనే 28 పరుగులు చేయి జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చాడు.
కిషాన్ ను తుది జట్టు నుంచి తప్పించడంలో కారణం లేకపోలేదు. మ్యాచ్ కు ముందు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ స్వల్ప గాయంతో ఇబ్బంది పడుతున్నాడని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ తర్వాత తెలిపాడు. కిషాన్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. కిషాన్ లేకపోవడంతో ప్లేయింగ్ 11 లో ఇండియా బ్యాటింగ్ డెప్త్ తగ్గింది. మరోవైపు బౌలింగ్ మాత్రం పటిష్టంగా కనిపిస్తుంది. బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ జట్టులో ఉన్నారు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్య, శివమ్ దూబే రూపంలో బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి.
ఇండియా బౌలింగ్:
ఈ మ్యాచ్ విషయానికి వస్తే విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. ఇషాన్ కిషాన్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా కిషాన్ నాలుగో టీ20 ఆడట్లేదని సూర్య టాస్ తర్వాత చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–-0తో కైవసం చేసుకున్న సూర్యకుమార్ సేన బుధవారం (జనవరి 28) జరిగే నాలుగో టీ20లోనూ గెలిచి క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటికే సిరీస్ కోల్పోయిన కివీస్ నాలుగో టీ20లో ఇండియాకు షాక్ ఇచ్చి ఎలాగైనా బోణీ కొట్టాలని కసరత్తులు చేస్తుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇండియా 3-0 ఆధిక్యంలో నిలిచింది.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):
టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ
ఇండియా (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
