ఖాట్మాండు: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తోన్న టూరిస్ట్ బస్సు అదుపు తప్పి లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గండకి ప్రావిన్స్‌లోని గూర్ఖా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. అధికారులు ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆదివారం (మార్చి 15) 16 మంది భక్తులతో ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ మైక్రోబస్ మనకమనా ఆలయం నుంచి తిరిగి వస్తుండగా గూర్ఖా జిల్లాలో అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారని, వీరంతా మనకమనా ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.
మృతులను ముత్తుకుమార్ (58), అనామాలిక్ (58), మీనాక్షి (59), శివగామి (53), విజయల్ (57), మీనా (58), తమిళర్సి (60)గా గుర్తించారు. క్షతగాత్రులు అన్బుఖైరేనిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
