Namo Re Song: వేలాది డ్యాన్సర్లతో గ్రాండ్‌గా ‘నమో రే నమోరే’.. విజువల్ స్పెక్టాకిల్‌గా ‘నాగబంధం’ ఫస్ట్ సాంగ్

Namo Re Song: వేలాది డ్యాన్సర్లతో గ్రాండ్‌గా ‘నమో రే నమోరే’.. విజువల్ స్పెక్టాకిల్‌గా ‘నాగబంధం’ ఫస్ట్ సాంగ్

‘పెదకాపు’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన  విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నాగబంధం’ (Nagabandham). ఈ సినిమాకు అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నభా నటేశ్, ఐశ్వర్య మేనన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ మరియు ఎన్‌ఐకే స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘నమో రే నమోరే’ (Namo Re NamoRe) అంటూ సాగే ఈ భక్తిరస గీతానికి శ్రీహర్ష సాహిత్యం అందించగా, జునైద్ కుమార్ స్వరపరిచారు. ఈ పాటను భారీ స్థాయిలో రూపొందించగా, గణేష్ ఆచార్య, శ్రేష్టి వర్మలు కలిసి కొరియోగ్రఫీని అందించారు.

1,000 మంది డ్యాన్సర్లు: ప్రత్యేకంగా ఈ పాటలో దాదాపు 1,000 మంది డ్యాన్సర్లు పాల్గొనడం విశేషం. భారతీయ నృత్య కళల వైవిధ్యం మరియు ఐక్యతను ప్రతిబింబించేలా ఈ పాటను అద్భుతమైన విజువల్ స్పెక్టాకిల్‌గా తీర్చిదిద్దారు. అనంత పద్మనాభస్వామి ఆలయ నేపథ్యాన్ని పోలిన భారీ సెట్టింగ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందించిన ఈ భక్తిరస గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

పాటలో నభా నటేశ్, ఐశ్వర్య మేనన్‌ సాంప్రదాయ వేషధారణలో కనిపిస్తూ డ్యాన్స్‌తో విజువల్ ట్రీట్ అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించగా, ఇప్పుడు ఫస్ట్ సాంగ్ కూడా ఆకట్టుకోవడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం వేసవి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.