Virat Kohli New Look: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2026 సీజన్ కి ముందు భారత స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దిగ్గజం విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ తో దర్శనం ఇస్తున్నాడు. ఈ కొత్త లుక్ ని ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జార్డన్ టబాక్మాన్ డిజైన్ సెట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను జార్డన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కింగ్ కోహ్లీ దాదాపు ప్రతీ ఐపీఎల్ సీజన్ లోనూ కొత్త లుక్ తో టోర్నీమెంట్ లోకి దిగుతుంటాడు. ఇప్పుడు మరోసారి తన నయా రూపంలో ఆర్సీబీ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది.
కాగా కింగ్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్ లోనే ఉంటున్నారు. కోహ్లి అనంతరం ఆర్సీబీ క్యాంపులో చేరబోతున్నాడు. ఈ ఏడాది జరిగే 19వ ఎడిషన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28వ తేదీ నుంచి స్టార్ట్ కానుంది. తొలి మ్యాచ్ లో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్లు 28న రాత్రి 7: 30 గంటలకు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
18 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ) గతేడాది తొలి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ చారిత్రత్మక విజయంలో కింగ్ విరాట్ కోహ్లిది కీలక పాత్ర.. గత సీజన్ లో కోహ్లీ 657 పరుగులతో లీడింగ్ టాప్ స్కోరర్ గా కొనసాగాడు. ఇప్పుడు కూడా అదే ఫామ్ ని ఈ ఏడాది ఎడిషన్ లో కూడా కొనసాగించాలని చేజ్ మాస్టర్ ఉవ్విళ్ళూరుతున్నాడు. తాను చివరిగా ఆడిన న్యూజిలాండ్ సిరీస్ లోనూ విరాట్ కోహ్లి దుమ్మలేపేశాడు.
