ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్నారు. ఆయన అస్వస్థతకు గురయ్యారని .. హత్యకు చేయబడ్డాడని పుకార్లు వస్తున్నాయి. అయితే నెతన్యాహు ఆరోగ్యంగానే ఉన్నారని.. అవన్నీ పుకార్లేనని ఇజ్రాయెల్ కొట్టిపారేసింది. ఈ క్రమంలో ఇరాన్ కు చెందిన పవర్ ఫుల్ సైన్యం.. ఇస్లామిక్ రివొల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (IRGC) ఆదివారం (మార్చి 15) సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది.
ఒక వేళ ఆ బాలల హంతకుడు బతికే ఉంటే వెంటాడి మరీ చంపుతాం.. అంటూ IRGC హెచ్చరించింది. జియోనిస్ట్ క్రిమినల్ ప్రధాని చనిపోవచ్చు లేదా కుటుంబ సభ్యులతో పారిపోవచ్చు.. దీన్ని బట్టి చూస్తే జియోనిస్టుల సంక్షోభాన్ని గుర్తుచేస్తుందని IRGC ఇరాన్ అధికారిక మీడియా ద్వారా పేర్కొంది. జియోనిస్టులు అంటే జియోనిజాన్ని ప్రోత్సహించేవాళ్లు. అంటే పాలస్తీనాలో జుయిష్ రాజ్య ఏర్పాటు కోసం పోరాడేవాళ్లు.
నెతన్యాహు చనిపోయాడనే వార్తలను ఇజ్రాయెల్ కొట్టివేసిన తర్వాత గ్వార్డ్స్ ఈ స్టేట్మెంట్ చేశారు. నెతన్యాహు ఎక్స్ హ్యాండిల్ లో వీడియో పోస్ట్ చేసిన తర్వాత అది వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో అది ఏఐ ఫూటేజ్ అనే ప్రచారం జరుగుతోంది. నెతన్యాహు కి ఏదో జరిగింది.. అందుకే ఏఐ వీడియో పోస్ట్ చేశారని.. ప్రచారం జరుగుతోంది.
దీనికి తోడు పీఎం నెతన్యాహు కుమారుడు, యైర్ నెతన్యాహు మార్చి 9 నుంచి ఎక్స్ లో ఎలాంటి పోస్టింగ్స్ చేయడం లేదు. అతని ఫ్యామిలీలో నెలకొన్న విషాదం కారణంగా దూరం ఉన్నట్లు చర్చ నడుస్తోంది. దీని ఆధారంగా కూడా నెతన్యాహుకు ఏదో జరిగిందనే ప్రచారం జరుగుతోంది.
ఇక ఎక్స్, గ్రోక్, ఏఐ చాట్ బాట్.. ఈ పుకార్లను కొట్టిపారేశాయి. నెతన్యాహు వీడియో మార్పులు చేసింది కాదని. అది విజువల్ ఇల్యూషన్ అని పేర్కొన్నాయి. ఇక ఇజ్రాయెల్ పీఎం హత్యకు గురయ్యారా అన్న ప్రశ్నకు.. పీఎం ఆఫీసు అధికారి.. అది ఫేక్ న్యూస్ గా కొట్టిపారేశారు.
